బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ మొత్తం మీద 2 సినిమాలు రిలీజ్ అవ్వగా రెండు సినిమాలు డిఫెరెంట్ ఆడియన్స్ ను టార్గెట్ చేసి ఆడియన్స్ ముందుకు వచ్చాయి. కాగా రెండు సినిమాలకు ఫుల్ ఫ్లేట్చుడ్ గా అయితే పాజిటివ్ టాక్ అయితే రాలేదు కానీ ఉన్నంతలో వరుడు కావలెను సినిమా కి కొంచం బెటర్ టాక్ వచ్చినా యూత్ అండ్ మాస్ ఆడియన్స్ సపోర్ట్ తో రొమాంటిక్ సినిమా ఫస్ట్ డే….
బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా ఫుల్ డామినేట్ చేసింది.. రొమాంటిక్ 1.5 కోట్లకు పైగా షేర్ ని అందుకుంటే వరుడు కావలెను 96 లక్షల రేంజ్ షేర్ తోనే సరిపెట్టుకుంది. ఇక రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు సినిమాలు డ్రాప్స్ ను సొంట్నం చేసుకున్నాయి కానీ…
రొమాంటిక్ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ చిన్నదే కాబట్టి ఉన్నంతలో సినిమా బాగా హోల్డ్ చేసింది అని చెప్పాలి. సినిమా మొదటి రోజు తో పోల్చితే 35-40% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకోగా తిరిగి ఈవినింగ్ షోల నుండి గ్రోత్ ని సొంతం చేసుకోగా మొత్తం మీద 2 వ రోజు రొమాంటిక్ బాక్స్ ఆఫీస్ దగ్గర…
60-70 లక్షల రేంజ్ షేర్ ని అందుకోవడం ఖాయమని చెప్పాలి, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 70-80 లక్షల రేంజ్ కలెక్షన్స్ ని అందుకోవచ్చు. ఇక వరుడు కావలెను సినిమా రెండో రోజు ఆల్ మోస్ట్ 30-35% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకోగా సినిమా రెండో రోజు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో 45-50 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునే…
అవకాశం ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా 60 లక్షల నుండి 65 లక్షల రేంజ్ కి వెళ్ళే అవకాశం ఉంది, కానీ 9 కోట్ల టార్గెట్ ను అందుకోవటానికి ఈ కలెక్షన్స్ ఏమాత్రం సరిపోవు అనే చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా జోరు పెంచాల్సిన అవసరం ఉంది. ఇక రెండు సినిమాలు 2వ రోజు అఫీషియల్ గా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటాయో చూడాలి.