టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు టాలీవుడ్ హిస్టరీ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకుంది, ఓవరాల్ గా 53.72 కోట్ల షేర్ ని 85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అందుకుని సంచలనం సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు రెండో రోజు లో అడుగు పెట్టింది, కాగా
అన్ని సినిమాలకు జరిగినట్లు గానే ఈ సినిమా కి కూడా రెండో రోజు డ్రాప్స్ బాగానే పడ్డాయి. మొదటి రోజు తో పోల్చితే రెండో రోజు డ్రాప్స్ ఆల్ మోస్ట్ 60% కి పైగానే ఉన్నాయి. రెండో రోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ 50% ఆక్యుపెన్సీ తో రన్ అయింది.
కానీ ఈవినింగ్ అండ్ నైట్ షోల గ్రోత్ మెల్లి మెల్లిగా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి సినిమా రోజు ముగిసే సరికి మంచి వసూళ్ళ ని అందుకునే అవకాశం ఉంది, ముఖ్యంగా పాజిటివ్ టాక్ ఉండటం తో రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా సాలిడ్ కలెక్షన్స్ ని అందుకోవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అన్నీ అనుకున్నట్లు జరిగితే 10 కోట్ల నుండి 12 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని సినిమా రెండో రోజు అందుకోవచ్చు. ఇది అద్బుతమైన కలెక్షన్స్ అని చెప్పొచ్చు. ఇక హిందీ మరియు మిగిలిన చోట్లా సినిమా ఈ రోజు 2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు. ఓవర్సీస్ లో కూడా సినిమా 2 నుండి 3 కోట్ల మేర షేర్ ని…
ఈ రోజు అందుకునే అవకాశం ఉంది, దాంతో టోటల్ గా సినిమా 2 వ రోజు వరల్డ్ వైడ్ గా 15 కోట్లకు పైగానే షేర్ ని అందుకోవచ్చని టాక్, మరి రోజు ముగిసే సరికి సినిమా బాక్స్ ఆఫీస్ స్టేటస్ ఎలా ఉంటుందో చూసి మరో ఆర్టికల్ లో అప్ డేట్ చేస్తాం.