ఒకప్పటి లా కాకుండా ఈ మధ్య కాలం లో ప్రతీ చిన్న విషయం ఈజీ గా సోషల్ మీడియా లో వైరల్ అవు తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమాల ఫస్ట్ లుక్స్ నుండి సాంగ్స్, ట్రైలర్, టీసర్, పోస్టర్ ఇలా ప్రతీ విషయం సోషల్ మీడియా లో ట్రెండ్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక రీసెంట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ…
వినయ విధేయ రామ సినిమా రెండో సాంగ్ ని రిలీజ్ చేయగా సోషల్ మీడియా లో కేవలం 10 నిమిషాల్లో నే ఇండియా లోను అలాగే 14 నిమిషాల్లోనే వరల్డ్ వైడ్ గా సాంగ్ ట్రెండ్ అవ్వడం మొదలైంది. ఓవరాల్ గా ఇప్పటి వరకు 50 వేల కి పైగా ట్వీట్స్ పోల్ అవ్వడం విశేషం.
మెగా ఫ్యాన్స్ రచ్చ తో సినిమా పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో మరోసారి వ్యక్తం అవుతుంది. సంక్రాంతి బరిలో భారీ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా రామ్ చరణ్ రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత చేస్తున్న సినిమా అవ్వడం తో ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా దుమ్ము లేపే రికార్డుల వర్షం కురవడం ఖాయమని చెప్పొచ్చు.