సంక్రాంతి రేసు లో చివరగా ప్రేక్షకుల ముందుకు తక్కువ థియేటర్స్ లో వచ్చిన విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ ల F2 బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం చేస్తూ దూసుకు పోతూ రిలీజ్ అయిన రోజు నుండి ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా అండర్ పెర్ఫార్మ్ చేయకుండా కలెక్షన్స్ సెన్సేషన్ ని కొనసాగిస్తూ దూసుకు పోతుండగా ఇప్పుడు మరో రికార్డ్ అందుకుంది ఈ సినిమా.
రెండో ఆదివారం అమెరికా లో కలెక్షన్స్ పరంగా ఆల్ టైం నాన్ బాహుబలి రికార్డ్ ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది, మరే సినిమా అందుకోలేనంత లీడ్ తో సినిమా కలెక్షన్స్ ఉండటం అక్కడ విశేషం అనే చెప్పాలి. ఒకసారి అక్కడ రెండో ఆదివారం ఎక్కువ కలెక్షన్స్…
అందుకున్న సినిమాలను పరిశీలిస్తే..#F2 -$146k**, #Fidaa-$104k, #Rangasthalam -$99k, #BharatAneNenu -$99k, #Mahanati-$89k, #GG-$89k, #SM-$88k, #AAa-$83k …ఫిదా కన్నా F2 ఇప్పటికే 42 వేల డాలర్స్ తో లీడ్ లో ఉండగా ఫైనల్ కౌంట్ ఇంకా అవుతుండటం లెక్క మరింత ఎక్కువగా ఉండే చాన్స్ ఉంది, సినిమా అక్కడ ఎ రేంజ్ లో దుమ్ము లేపుతుందో చెప్పడానికి ఇది నిదర్శనం అని చెప్పొచ్చు.