కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్ రీసెంట్ టైం లో కెరీర్ బెస్ట్ ఫామ్ తో దూసుకు పోతూ ఉండగా చేసిన సినిమా చేసినట్లు బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ విజయ్ కి తిరుగు లేని క్రేజ్ ని అన్ని చోట్లా సొంతం అయ్యేలా చేస్తూ ఉందని చెప్పాలి. లాస్ట్ ఇయర్ సంక్రాంతి కి ఆడియన్స్ ముందుకు వచ్చిన మాస్టర్ మూవీ మరీ అనుకున్న రేంజ్ లో….
లేక పోయినా కానీ ఆడియన్స్ లో సినిమా పై ఉన్న క్రేజ్ తో సంచలన కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా తెలుగు లో కూడా ఈ సినిమా విజయ్ కెరీర్ లోనే ఇక్కడ ఆల్ టైం బిగ్గెస్ట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపింది. పండగ సెలవుల అడ్వాంటేజ్ తో….
ఓ రేంజ్ లో కుమ్మేసిన ఈ సినిమా…. తెలుగు లో తర్వాత టెలివిజన్ లో టెలికాస్ట్ అయినప్పుడు మాత్రం విజయ్ నటించిన ప్రీవియస్ మూవీ బిగిల్ తో పోల్చితే చాలా తక్కువ రేటింగ్ నే ఇక్కడ సొంతం చేసుకుని నిరాశ పరిచింది కానీ తమిళ్ లో మాత్రం ఈ సినిమా….
ఊహకందని రేంజ్ లో ఎక్స్ లెంట్ హోల్డ్ తో అద్బుతాలు సృష్టిస్తూ రేటింగ్స్ పరంగా దూసుకు పోతుంది… సినిమా అక్కడ ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు 20.02 రేటింగ్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది… నార్మల్ కమర్షియల్ మూవీ అయ్యి ఉంటే ఇంకా ఎక్కువ రేటింగ్ వచ్చేదని అప్పట్లో అనుకోగా సెకెండ్ టైం టెలికాస్ట్ రీసెంట్ గా జరగగా ఈ సారి రేటింగ్….
బాగా పడిపోతుంది అని అంతా అనుకున్నారు కానీ మాస్టర్ సినిమా సెకెండ్ టైం టెలికాస్ట్ లో కూడా ఏకంగా 16.80 రేటింగ్ ను సొంతం చేసుకుని రిమార్కబుల్ హోల్డ్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గరే కాదు టెలివిజన్ లో కూడా ఊరమాస్ రేటింగ్స్ తో విజయ్ తన క్రేజ్ పవర్ ని చూపెడుతున్నాడు…