బాక్స్ ఆఫీస్ దగ్గర యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ కస్టడీ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా ఓపెనింగ్స్ పరంగా తీవ్రంగా నిరాశ పరిచగా కస్టడీ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఈ కలెక్షన్స్ ఓపెనింగ్స్ అసలు ఏమాత్రం సరిపోవు అనే చెప్పాలి. ఇక సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్…
30-40% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో కూడా ట్రాక్ చేసిన సెంటర్స్ లో డ్రాప్స్ గట్టిగానే కనిపిస్తున్నాయి. దాంతో సినిమా ఇప్పుడు రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 1 కోటి రేంజ్ లో షేర్ ని…
సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కొంచం బాగుంటే సినిమా 1.2 కోట్ల దాకా షేర్ ని అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా రెండో రోజు 1.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవచ్చు.
కానీ సినిమా రెండో రోజు మినిమమ్ హోల్డ్ ని అయినా చూపించింది అని చెప్పడానికి మినిమమ్ 2.5 కోట్ల రేంజ్ లో అయినా కలెక్షన్స్ ని సాధించాల్సి ఉంటుంది. మరి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో ఏమైనా ఊహకందని అద్బుతాలు జరిగితే తప్పితే సినిమా కలెక్షన్స్ ఈ మార్క్ ని అందుకునే అవకాశం లేదు… ఇక టోటల్ 2 డేస్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.