యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ కస్టడీ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా అంచనాలను అందుకోవడంలో తీవ్రంగా నిరాశ పరిచింది. సినిమా 3 కోట్ల రేంజ్ లో అయినా షేర్ ని అందుకుంటుంది అనుకున్నా కూడా 2.62 కోట్ల రేంజ్ లో షేర్ ని మాత్రమే మొదటి రోజు సొంతం చేసుకుంది. ఇక రెండో రోజులో అడుగు పెట్టిన సినిమా…
ఓవరాల్ గా మొదటి రోజుతో పోల్చితే ఏమాత్రం హోల్డ్ ని రెండో రోజు చూపించలేకపోతుంది. రెండో రోజు మార్నింగ్ షోలకు ఆల్ మోస్ట్ 30-40% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా మ్యాట్నీ షోలకు కొంచం గ్రోత్ ని చూపించే అవకాశం కనిపిస్తూ ఉండగా మొత్తం మీద…
కస్టడీ సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర అటూ ఇటూగా 1.1 కోట్ల నుండి 1.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటేనే ఈ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి…
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఈ కలెక్షన్స్ అసలు సరిపోవు అనే చెప్పాలి. సినిమా జస్ట్ అనిపించే రేంజ్ కలెక్షన్స్ ని అయినా అందుకోవాలి అంటే 2 కోట్ల రేంజ్ లో అయినా హోల్డ్ ని చూపించాల్సి ఉంటుంది. ఇక డే ఎండ్ వరకు సినిమా ఎలాంటి హోల్డ్ ని చూపిస్తుందో చూడాలి.