Home న్యూస్ మద గజ రాజ 2nd DAY తెలుగు కలెక్షన్స్!!

మద గజ రాజ 2nd DAY తెలుగు కలెక్షన్స్!!

0

విశాల్ హీరోగా నటించిన 12 ఏళ్ల క్రితం మూవీ అయిన మదగజరాజ(Madha Gaja Raja) మూవీ ఎట్టకేలకు ఆడియన్స్ ముందుకు ఇప్పుడు తమిళ్ లో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కుమ్మేసింది. మంచి లాంగ్ రన్ ను కూడా దక్కించు కున్న సినిమా ఏకంగా 50 కోట్లకు పైగా గ్రాస్ ను..

అక్కడ సొంతం చేసుకున్న తర్వాత ఆడియన్స్ ముందుకు తెలుగులో ఈ వీకెండ్ లో రిలీజ్ అవ్వగా ఇక్కడ కూడా మాస్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్స్ ఇష్టపడే ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా..

మరీ ఓల్డ్ ఫిల్మ్ అవ్వడంతో మరీ కొత్త సినిమాల రేంజ్ లో జోరు చూపించకున్నా ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన సినిమాల లోకి బెటర్ ఓపెనింగ్స్ నే సొంతం చేసుకున్న ఈ సినిమా ఆల్ మోస్ట్ మొదటి రోజున 40 లక్షల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకోగా..

రెండో రోజుకి వచ్చేసరికిమార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు కొంచం డ్రాప్స్ ఉన్నప్పటికీ కూడా ఈవినింగ్ షోల నుండి మాస్ సెంటర్స్ లో కొంచం పర్వాలేదు అనిపిస్తున్న సినిమా మొత్తం మీద ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే…

మరోసారి 35-40 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. 12 ఏళ్ల క్రితం నాటి సినిమా కి ఇలాంటి కలెక్షన్స్ గొప్పే అని చెప్పొచ్చు. టీం సినిమాను బాగానే ప్రమోట్ చేయడం వలన కొత్త సినిమాల మీద బెటర్ గా ట్రెండ్ అవుతున్న సినిమా ఇక వీకెండ్ లో ఓవరాల్ గా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here