Home న్యూస్ 2nd Day విజయ్ “గోట్” కలెక్షన్స్….మరోసారి మాస్ రచ్చ!!

2nd Day విజయ్ “గోట్” కలెక్షన్స్….మరోసారి మాస్ రచ్చ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ కి ముందు పెద్దగా హైప్ లేక పోయినా కూడా రిలీజ్ అయిన తర్వాత అంచనాలను మించి ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేశాడు కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie)సినిమాతో….

తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా అంచనాలను అందుకోక పోయినా కూడా మిగిలిన చోట్ల…ముఖ్యంగా తమిళనాడు అలాగే ఓవర్సీస్ లో ఊహకందని రేంజ్ లో ఊచకోత కోసిన సినిమా మొత్తం మీద 100 కోట్ల మార్క్ ని దాటేసి మాస్ రచ్చ చేసింది.

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజులో అడుగు పెట్టిన సినిమా తెలుగు రాష్ట్రాల్లో డ్రాప్స్ ను హెవీగానే సొంతం చేసుకోగా ట్రాక్ చేసిన సెంటర్స్ గ్రాస్ లెక్కల ప్రకారం…మొత్తం మీద సాలిడ్ డ్రాప్స్ ను అందుకుని మొత్తం మీద ప్రజెంట్ ట్రెండ్ ను చూస్తూ ఉంటే కోటి రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని…

అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే కొంచం షేర్ పెరగవచ్చు కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఈ కలెక్షన్స్ సరిపోవు అనే చెప్పాలి. ఇక తమిళనాడులో మరోసారి ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేస్తూ ఉండగా 30% రేంజ్ లో….

డ్రాప్స్ ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో కనిపిస్తూ ఉండగా 20 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అటూ ఇటూగా అందుకునే అవకాశం ఉండగా కర్ణాటక, కేరళలో రెస్ట్ ఆఫ్ ఇండియా లో డ్రాప్స్ ఉండగా ఓవర్సీస్ లో మాత్రం ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేస్తున్న సినిమా…

అన్ని చోట్లా కలిపి సినిమా రెండో రోజు వరల్డ్ వైడ్ గా 45-48 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ హోల్డ్ బాగుంటే షేర్ 50 కోట్ల మార్క్ కి అటూ ఇటూగా ఉండొచ్చు. సినిమా ఆఫ్ లైన్ టాక్ కొంచం మిక్సుడ్ గా ఉన్నా రెండో రోజు హోల్డ్ ఎక్స్ లెంట్ గా ఉంది. ఇక టోటల్ గా 2 రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here