Home న్యూస్ కల్కి-RRR-KGF2…..2 వీక్స్ కలెక్షన్స్ కంపారిజన్!!

కల్కి-RRR-KGF2…..2 వీక్స్ కలెక్షన్స్ కంపారిజన్!!

0
Kalki 2898 AD Vs RRR Movie Vs KGF Chapter2 Movies 2 Weeks Total Collections Report
Kalki 2898 AD Vs RRR Movie Vs KGF Chapter2 Movies 2 Weeks Total Collections Report

బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ అయిన RRR మూవీ మరియు KGF Chaptar2 మూవీస్ తో పోల్చితే రెబల్ స్టర్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie) మంచి కలెక్షన్స్ తో రెండు వారాలను పూర్తి చేసుకుంది. రెండో వారం వర్కింగ్ డేస్ లో కొంచం ఎక్కువగా స్లో అయినా కూడా…

ఓవరాల్ గా 2 వారాలను సాలిడ్ కలెక్షన్స్ తోనే ముగించగా ఒకసారి 2 వారాలు పూర్తి అయ్యే టైంకి ఆర్ ఆర్ ఆర్ మరియు కేజిఎఫ్ చాప్టర్2 సినిమాలతో కంపేర్ చేస్తే ఏ సినిమా లీడ్ లో ఉంది అన్నది ఆసక్తిగా మారగా ముందుగా ఆర్ ఆర్ ఆర్ సినిమా విషయానికి వస్తే….

ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 2 వారాలు పూర్తి అయ్యే టైంకి వరల్డ్ వైడ్ గా 535.21 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా తర్వాత వచ్చిన కేజిఎఫ్ చాప్టర్2 సినిమా 473.16 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది. ఇక కల్కి మూవీ 2 వీక్స్ లో 456.32 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది.

ఇక వరల్డ్ వైడ్ గ్రాస్ విషయానికి వస్తే ఆర్ ఆర్ ఆర్ మూవీ 967 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా కేజిఎఫ్ చాప్టర్2 మూవీ 957.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. ఇక కల్కి మూవీ 884 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది…. 

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆర్ ఆర్ ఆర్ మూవీ 248.76 కోట్ల షేర్ ని అందుకోగా కేజిఎఫ్ చాప్టర్2 మూవీ 76.21 కోట్ల షేర్ ని అందుకుంది. కల్కి మూవీ 167.07 కోట్ల షేర్ ని అందుకుంది..ఓవరాల్ గా ఆర్ ఆర్ ఆర్ మూవీ కి తెలుగు రాష్ట్రాల్లో సూపర్ లీడ్ 2 వీక్స్ కలెక్షన్స్ లో హెల్ప్ అవ్వగా…

కేజిఎఫ్2 సినిమాకి హిందీ కలెక్షన్స్ సాలిడ్ ప్లస్ పాయింట్ అయ్యాయి. వీటితో పోల్చితే కల్కి మూవీ అన్ని చోట్లా పర్వాలేదు అనిపిస్తూ ఉన్నా ఓవరాల్ గా 3వ ప్లేస్ లో ఉంది. ఇక మూడో వీక్ లో కొత్త సినిమాల పోటితో ఎలాంటి కలెక్షన్స్ ని కల్కి అందుకుంటుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here