థియేటర్స్ లో జనాలు రీసెంట్ టైంలో అనుకున్న రేంజ్ లో రావడం లేదు, సరైన సినిమాలు రిలీజ్ అవ్వడం లేదు, రిలీజ్ అయిన సినిమాలు ఆడియన్స్ ను అలరించడం చాలా అరుదుగానే జరుగుతూ ఉంది. ఒకవేళ ఆడియన్స్ మెప్పుని పొందిన సినిమాలు సైతం బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని రోజులు స్టడీగా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటాయో అన్నది చెప్పలేం…
అందుకే మేకర్స్ మంచి రేట్స్ వచ్చినప్పుడు తక్కువ టైంకే సినిమాల డిజిటల్ రైట్స్ ను అమ్మేస్తున్నారు….కానీ కొన్ని కొన్ని సార్లు ఇది మరీ త్వరగా జరగడం అన్నది విచారకం అనే చెప్పాలి. ఎందుకంటే అసలే తక్కువగా జనాలు థియేటర్స్ కి వస్తున్నారు, ఇలాంటి టైంలో మరీ తక్కువ టైంకే సినిమాలు డిజిటల్ కి వస్తున్నాయంటే…
ఇక జనాలు రెండు మూడు వారాలు ఆగితే డిజిటల్ లో వచ్చే సినిమాకి భారీ రేట్లు పెట్టి థియేటర్స్ వెళ్ళడం ఎందుకు అనుకోవడం ఖాయం. ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా మే 31 వీకెండ్ లో రిలీజ్ అయిన విశ్వక్ సేన్(vishwak sen) నటించిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి(Gangs Of Godavari Movie) మిక్సుడ్ టాక్ తో కూడా పర్వాలేదు అనిపించేలా…
కలెక్షన్స్ ని సాధిస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ కి రెండో వారంలో చేరువ అయ్యే అవకాశం ఉన్న టైంలో ఇప్పుడు సడెన్ గా సినిమా డిజిటల్ రైట్స్ ను కొన్న నెట్ ఫ్లిక్స్ లో ఇప్పుడు డిజిటల్ రిలీజ్ కి సిద్ధం అవుతుందని అనౌన్స్ చేశారు… ఈనెల 14న సినిమా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది. అంటే కేవలం రిలీజ్ అయిన 2 వారాల గ్యాప్ కే….
డిజిటల్ రిలీజ్ కాబోతుంది…దాంతో సోషల్ మీడియాలో 2 వారాలకే డిజిటల్ రిలీజ్ అయితే ఇక మేం థియేటర్స్ కి వెళ్ళడం ఎందుకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు… సినిమా క్లీన్ హిట్ అవ్వాలి అంటే ఇంకొంచం కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి టైంలో డిజిటల్ రిలీజ్ న్యూస్ సినిమా కలెక్షన్స్ పై ఇంపాక్ట్ చూపే అవకాశం ఉంది.