పెద్ద సినిమాలు అంటే క్రేజ్ ఉంటుంది కాబట్టి ఆ సినిమాలను జనాలు ఎలా ఉన్నా బాగా చూడటానికి వస్తారు. అది థియేటర్స్ లో, కానీ డిజిటల్ లో మంచి టాక్ వచ్చిన సినిమా అండ్ జనాల్లో రీచ్ ను సొంతం చేసుకున్న సినిమా కే ఆడియన్స్ నుండి ఎక్కువ రెస్పాన్స్ ఉంటుంది, ఆల్ రెడీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి తర్వాత డిజిటల్ లో రిలీజ్ ను సొంతం చేసుకున్న రీసెంట్ మూవీస్ లో…
శ్రీదేవి సోడా సెంటర్ 7 రోజులలో 50 మిలియన్స్ కి పైగా మినట్స్ వాట్చ్ టైం ను సొంతం చేసుకోగా తర్వాత అఖిల్ అక్కినేని నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ఆహా వీడియోలో 2 రోజుల్లో 100 మిలియన్స్ కి పైగా మినట్స్ వాట్చ్ టైం ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది.
ఈ సినిమాలతో పోల్చితే చిన్న సినిమా అయినా తేజ సజ్జ నటించిన లేటెస్ట్ మూవీ అద్బుతం బాక్స్ ఆఫీస్ దగ్గర కాకుండా డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ను రీసెంట్ గా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సొంతం చేసుకోగా సినిమాను డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ రెండూ కలిపి…
7 కోట్ల రేంజ్ రేటు కి కొన్నారు… కాగా రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా అల్టిమేట్ వ్యూవర్ షిప్ తో దూసుకు పోతూ ఉండగా కేవలం 3 రోజుల టైం లోనే ఏకంగా 100 మిలియన్స్ కి పైగా మినట్స్ వాట్చ్ టైం ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది ఈ సినిమా… ఈ సినిమా కి పెద్దగా పబ్లిసిటీ కూడా ఏమి చేయలేదు మేకర్స్… సైలెంట్ గానే….
డిజిటల్ రిలీజ్ అయినా కానీ ఈ రేంజ్ లో వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించిన ఈ చిన్న సినిమా పెట్టిన రేటు కు ఫుల్ న్యాయం చేసింది అనే చెప్పాలి. ఇక లాంగ్ రన్ లో ఇంకా ఎలాంటి హోల్డ్ తో దూసుకు పోతుందో అన్నది ఆసక్తి కరం అని చెప్పొచ్చు. సినిమా కూడా బానే ఉందని టాక్ ఆడియన్స్ లో ఉండటం మరింత కలిసి వచ్చే అంశం.