టీసర్ ట్రైలర్ లతో మంచి అంచనాలను సొంతం చేసుకుని ఆడియన్స్ ముందుకు దసరా సీజన్ ఫేవరేట్ గా బరిలోకి దిగిన శర్వానంద్ మరియు సిద్దార్థ్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మహా సముద్రం బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ టాక్ నే సొంతం చేసుకుంది కానీ పోటి లో ఇతర సినిమాలు యూత్ ని ఫ్యామిలీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడంతో మాస్ ని నమ్ముకున్న ఈ సినిమా ఆ మాస్ ఆడియన్స్…
కూడా ఇతర సినిమాలనే ఎంచుకోవడంతో మహా సముద్రం సినిమా కి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎఫెక్ట్ గట్టిగానే పడింది. సినిమా మొదటి రోజు నుండే అండర్ పెర్ఫార్మ్ చేయడం మొదలు పెట్టగా రెండో రోజు నుండి పోటి తట్టుకోలేక పోయింది. మూడో రోజు సినిమా….
బాక్స్ ఆఫీస్ దగ్గర 80-90 లక్షల దాకా కలెక్షన్స్ ని అందుకుంటుంది అనుకుంటే… ఇతర సినిమాలు చూపినట్లు గ్రోత్ చూపలేక పోయిన ఈ సినిమా 89 లక్షల షేర్ ని మూడో రోజు సొంతం చేసుకుంది. బ్రేక్ ఈవెన్ దృశ్యా ఇవి సరిపోవు అనే చెప్పాలి. ఇక 3 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని ఒక సారి గమనిస్తే…
👉Nizam: 1.58Cr
👉Ceeded: 90L
👉UA: 61L
👉East: 32L
👉West: 25L
👉Guntur: 46L
👉Krishna: 24L
👉Nellore: 21L
AP-TG Total:- 4.57CR(7.63CR~ Gross)
Ka+ROI: 18L
OS – 25L
Total WW: 5.00CR(8.70CR~ Gross)
ఇవీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క…
సినిమాను మొత్తం మీద 13.5 కోట్ల రేటు కి అమ్మగా సినిమా 14 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద 3 రోజుల తర్వాత క్లీన్ హిట్ కోసం ఇంకా 9 కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర 4 వ రోజు అయినా ఏమైనా గ్రోత్ ని సినిమా చూపుతుందో లేదో చూడాలి ఇక..