బాక్స్ ఆఫీస్ దగ్గర అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా మొత్తం మీద మొదటి వీకెండ్ ని ఘనంగా పూర్తీ చేసుకుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది, కానీ రెండో రోజు లెవల్ లో అంచనాలను ఓ రేంజ్ లో మించే కలెక్షన్స్ ని అందుకోలేదు, పండగ సెలవులు అయిపోయాయి కానీ సిటీలకు వెళ్ళే వాళ్ళు…
ఈవినింగ్స్ నుండి తిరిగు ప్రయాణం పెట్టుకోవడంతో ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పై ఇంపాక్ట్ ఉండగా ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3 వ రోజు 4 కోట్ల నుండి 4.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది అనుకుంటే సినిమా 4.03 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని…
మొత్తం మీద సూపర్ సాలిడ్ గా హోల్డ్ చేసింది, రెండో రోజు లెవల్ లో రెచ్చి పోయి ఉంటే 5 కోట్ల రేంజ్ కి వెళ్ళేది కానీ అలా జరగలేదు, అయినా కానీ ఫస్ట్ వీకెండ్ ని అద్బుతంగా ముగించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇప్పుడు 3 రోజులకు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 5.41Cr
👉Ceeded: 2.94Cr
👉UA: 1.67Cr
👉East: 86L
👉West: 70L
👉Guntur: 1.03Cr
👉Krishna: 80L
👉Nellore: 61L
AP-TG Total:- 14.02CR(23.70CR Gross)
Ka+ROI: 1.12Cr
OS – 2.10Cr
Total WW: 17.24CR(29CR~ Gross)
ఇదీ సినిమా మొత్తం మీద 3 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క…
సినిమాను మొత్తం మీద 18.5 కోట్ల రేటు కి అమ్మగా 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ కోసం ఇంకా 1.76 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. వర్కింగ్ డేస్ లో మిగిలిన మొత్తాన్ని అందుకోవడం పెద్ద కష్టమేమి కాదనే చెప్పాలి.