Home న్యూస్ 300 కోట్ల జాతర….బాక్స్ ఆఫీస్ అల్లకల్లోలం సామి!!

300 కోట్ల జాతర….బాక్స్ ఆఫీస్ అల్లకల్లోలం సామి!!

0

రిలీజ్ అయిన రోజు నుండి సెన్సేషనల్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన లేటెస్ట్ మూవీ జైలర్(Jailer) మూవీ ఊచకోత 3 రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో 24.50 కోట్ల గ్రాస్ ను అందుకోగా…

సినిమా ఓవర్సీస్ లో అప్ డేట్ అయిన కలెక్షన్స్ తో వరల్డ్ వైడ్ గా 224 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుంది. ఇక సినిమా 4వ రోజు సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా వీర విహారం చేస్తూ ఉండగా తెలుగు రాష్ట్రాలలో సినిమా ఈ రోజు 8 కోట్లకు పైగానే గ్రాస్ ను అందుకోబోతుంది.

ఇక సినిమా తమిళనాడులో 18 కోట్లకు పైగా గ్రాస్ ను మరోసారి అందుకోబోతుండగా ఫైనల్ లెక్కలు బాగుంటే 20 కోట్లను టచ్ చేసే అవకాశం ఉంది. ఇక కర్ణాటకలో ఊచకోత కోస్తున్న సినిమా 6 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోబోతుండగా కేరళలో కూడా ఆల్ మోస్ట్ ఇదే రేంజ్ లో…

దుమ్ము లేపే అవకాశం ఉంది. ఇక ఓవర్సీస్ లో 3 మిలియన్స్ కి పైగా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోబోతుండగా సినిమా మొత్తం మీద 4వ రోజు ఇండియాలో 42 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకోబోతుండగా ఫైనల్ లెక్కలు బాగుంటే 45 కోట్ల గ్రాస్ ను అందుకోబోతుండగా…

ఓవర్సీస్ లో సినిమా 25 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండటంతో 70 కోట్ల నుండి 75 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోబోతుంది. దాంతో సినిమా వరల్డ్ వైడ్ గా 4 రోజుల్లో 300 కోట్లకు అటూ ఇటూగా గ్రాస్ కలెక్షన్స్ ని ఇప్పుడు సొంతం చేసుకోబోతుందని చెప్పాలి. ఇక ఏరియాల వారి డీటైల్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here