బాక్స్ ఆఫీస్ దగ్గర మార్చ్ నెలలో ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించడమే కష్టం అయితే…ఈ మార్చ్ నెలలో కలెక్షన్స్ పరంగా రిమార్కబుల్ ట్రెండ్ ను చూపెడుతూ వీకెండ్ లోనే కాదు వర్కింగ్ డేస్ లో కూడా ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపెడుతున్న నాచురల్ స్టార్ నాని(Nani) నిర్మాతగా నిర్మించిన లేటెస్ట్ మూవీ కోర్ట్(Court State Vs A Nobody Movie) సినిమా…
సాలిడ్ లాభాలను సొంతం చేసుకుని ఆల్ రెడీ 4 రోజుల టైంకే డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి సంచలనం సృష్టించింది. సినిమా వర్కింగ్ డేస్ లో చాలా లిమిటెడ్ డ్రాప్స్ నే సొంతం చేసుకుంటూ హోల్డ్ ని చూపెడుతూ ఉండగా… పేరుకి చిన్న సినిమానే అయినా…
ఇప్పుడు 5 రోజులు పూర్తి అయ్యే టైంకే ఏకంగా బాక్స్ ఆఫీస్ దగ్గర 30 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసి దుమ్ము దుమారం లేపడం విశేషం అనే చెప్పాలి. 4 రోజులు పూర్తి అయ్యే టైంకి 27.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ నిఒ సొంతం చేసుకుని సంచలనం సృష్టించిన సినిమా…
5వ రోజున మరోసారి వర్కింగ్ డే లో రిమార్కబుల్ హోల్డ్ తో 3.5 కోట్లకు పైగానే గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…ఫైనల్ లెక్కలు బాగుంటే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉన్న నేపధ్యంలో ఓవరాల్ గా ఈ రోజు సాధించే కలెక్షన్స్ తో సినిమా..
ఏకంగా 31 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించింది. అసలు స్టార్ కాస్ట్ గురించి పెద్దగా ఎవరికీ తెలియకున్నా కూడా ఈ రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని కుమ్మేయడం మాములు విషయం కాదు. ఇక లాంగ్ రన్ లో ఇదే జోరు కొనసాగిస్తే 45-50 కోట్ల రేంజ్ కి వెళ్ళే అవకాశం కూడా ఉందని చెప్పాలి.