Home న్యూస్ 1000 కోట్ల సినిమా….33 రోజులు నాన్ స్టాప్ గా రికార్డ్!!

1000 కోట్ల సినిమా….33 రోజులు నాన్ స్టాప్ గా రికార్డ్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ పఠాన్ రిలీజ్ అయిన రోజు నుండి అనేక రికార్డులతో ఊచకోత కోయగా సినిమా ఇప్పటికీ కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం చేస్తూ ఉండగా ఇప్పుడు బాలీవుడ్ తరుపున సినిమా మరోసారి అల్టిమేట్ రికార్డ్ ను నమోదు చేసింది. వరల్డ్ వైడ్ గా రీసెంట్ గా 1000 కోట్ల గ్రాస్ మార్క్ ని అధిగమించిన ఈ సినిమా…

ఇండియాలో 520 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించగా ఇప్పటికీ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో రన్ అవుతున్న ఈ సినిమా రిలీజ్ అయిన రోజు నుండి ఇప్పుడు 32 రోజుల పాటు బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా ఇప్పుడు…

ప్రతీ రోజూ కూడా కోటికి తగ్గకుండా నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దుమ్ము లేపింది. సినిమా 30వ రోజు 1 కోటి మార్క్ నే అందుకోవడంతో 31వ రోజు కలెక్షన్స్ తగ్గుతాయి అనుకున్నా కొత్త సినిమాలు రిలీజ్ అయినా 1.05 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా…

32వ రోజు శనివారం అవ్వడంతో మరోసారి జోరు పెంచింది. ఇక 33 వ రోజు ఆదివారం అవ్వడంతో మరోసారి కోటి మార్క్ ని దాటే అవకాశం ఉన్న ఈ సినిమా బాలీవుడ్ లో ఆల్ టైం ఎపిక్ బిగ్గెస్ట్ రికార్డ్ ను ఇప్పుడు నమోదు చేసింది అని చెప్పాలి. ఇక లాంగ్ రన్ లో ఇంకా ఎంత దూరం సినిమా వెళుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here