బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని ఓవరాల్ గా మంచి వసూళ్ళని సొంతం చేసుకుని పూర్తీ చేసుకున్న అఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రెండో వారంలో అడుగు పెట్టింది. రెండో వారంలో బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా పోటి లో ఉన్న సినిమాలు ఏమి లేవు, అన్నీ కూడా చాలా చిన్న సినిమాలు, దాంతో భారీగానే థియేటర్స్ ని హోల్డ్ చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్…
8వ రోజు మట్టుకు వర్కింగ్ డే అవ్వడం తో పెద్దగా ఇంపాక్ట్ అయితే ఏమి క్రియేట్ చేయలేక పోయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర 7 వ రోజు తో పోల్చితే 8 వ రోజు ఓవరాల్ గా 50% రేంజ్ లో డ్రాప్ ను సొంతం చేసుకుంది, వర్కింగ్ డే కాబట్టి ఇలాంటి డ్రాప్స్ కామన్ అనే చెప్పాలి.
మొత్తం మీద 7 వ రోజున సినిమా 36 లక్షల రేంజ్ లో షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటే 8 వ రోజు 19 లక్షల రేంజ్ షేర్ నే సాధించింది. దాంతో టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 36 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్నాయి. టోటల్ 8 డేస్ వరల్డ్ వైడ్ షేర్ వివరాలను గమనిస్తే…
👉Nizam: 7.07Cr
👉Ceeded: 3.75Cr
👉UA: 2.18Cr
👉East: 1.11Cr
👉West: 90L
👉Guntur: 1.27Cr
👉Krishna: 1.00Cr
👉Nellore: 76L
AP-TG Total:- 18.04CR(29.72CR Gross)
Ka+ROI: 1.36Cr
OS – 2.26Cr
Total WW: 21.66CR(36.10CR~ Gross)
ఇదీ సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 8 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క…
సినిమాను మొత్తం మీద ఓన్ రిలీజ్ కాకుండా 18.5 కోట్ల రేటు కి అమ్మగా సినిమా 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ గా 8 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో సినిమా 2.66 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను కూడా సొంతం చేసుకుంది. 8 వ రోజు సాలిడ్ డ్రాప్స్ కొంచం శాకిచ్చినా 9-10 రోజుల్లో మళ్ళీ సినిమా పుంజుకోవడం ఖాయమని చెప్పాలి.