బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సంక్రాంతికి భారీ లెవల్ లో రిలీజ్ అయిన మూవీస్ లో కింగ్ నాగార్జున(Akkineni Nagarjuna) నటించిన లేటెస్ట్ మూవీ నా సామి రంగ(Naa Saami Ranga TRP Rating) వరుస ఫ్లాఫ్స్ లో ఉన్న నాగార్జునకి డీసెంట్ కంబ్యాక్ మూవీగా నిలిచింది. రొటీన్ మూవీలానే అనిపించినా కూడా సంక్రాంతి సీజన్ కి పెర్ఫెక్ట్ గా…
అనిపించిన సినిమా సంక్రాంతి సీజన్ అడ్వాంటేజ్ తో ఉన్నంతలో మంచి ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని తర్వాత స్లో అయినా కూడా లాంగ్ రన్ లో బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచింది… మొత్తం మీద చాలా టైంకి నాగార్జునకి బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా…
కంబ్యాక్ మూవీగా నిలిచిన సినిమా 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి 21.88 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని క్లీన్ హిట్ గా నిలిచింది. 38 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న ఈ సినిమా తర్వాత డిజిటల్ లో కూడా మంచి జోరునే చూపించిన తర్వాత టెలివిజన్ లో రీసెంట్ గా టెలికాస్ట్ అయింది.
సినిమా శాటిలైట్ రైట్స్ ను సొంతం చేసుకున్న స్టార్ మా ఛానెల్ బాగానే సినిమాను ప్రమోట్ చేయగా ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు సినిమా మొత్తం మీద 8.08 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుంది… రీసెంట్ టైంలో వచ్చిన మూవీస్ లో ఇది మంచి రేటింగ్ అనే చెప్పాలి. ఇక లాంగ్ రన్ లో టెలివిజన్ లో సినిమా ఎలాంటి జోరుని చూపిస్తుందో చూడాలి ఇక…