అంజలి(Anjali) కెరీర్ లో ప్రతిష్టాత్మక 50వ సినిమాగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ గీతాంజలి మళ్ళీ వచ్చింది(Geethanjali Malli Vachindhi 3 Days WW Collections) ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా వచ్చింది, రొటీన్ మూవీ అనిపించుకున్న ఈ హర్రర్ కామెడీలో కొన్ని సీన్స్ పర్వాలేదు అనిపించేలా ఎంటర్ టైన్ చేసినా కూడా…
మేజర్ పోర్షన్ ఆఫ్ ది మూవీ మాత్రం బోర్ అనిపించేలా సాగగా మొత్తం మీద కొంచం ఓపికతో చూస్తె ఒకసారి చూడొచ్చు అనిపించే రేంజ్ లో టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 40 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా మిగిలిన 2 రోజుల్లో జస్ట్ ఓకే అనిపించేలా పెర్ఫార్మ్ చేసింది.
బుక్ మై షోలో మొత్తం మీద 30 వేల లోపు టికెట్ సేల్స్ జరగగా ఆఫ్ లైన్ లో మాస్ సెంటర్స్ లో కొంచం పర్వాలేదు అనిపించిన ఈ సినిమా ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల్లో 65 లక్షల లోపు షేర్ ని అటూ ఇటూగా అందుకుందని అంచనా… ఇక ఓవర్సీస్ లో 50 వేల డాలర్స్ దాకా వసూళ్ళని అందుకున్న సినిమా మొత్తం మీద….
తెలుగు రాష్ట్రాల ఆవల 15 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 3 రోజుల్లో ఈ సినిమా 90 లక్షల రేంజ్ లో షేర్ ని 1.7 కోట్ల కి అటూ ఇటూగా గ్రాస్ మార్క్ ని అందుకుంది… సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 2.5 కోట్ల దాకా ఉంటుందని అంచనా…
ఆ లెక్కల 3 రోజుల్లో పడుతూ లేస్తూ పర్వాలేదు అనిపించిన సినిమా మిగిలిన రన్ లో మొత్తం మీద ఇలానే స్టడీగా రన్ ని కొనసాగిస్తే పర్వాలేదు అనిపించే రిజల్ట్ ను సొంతం చేసుకోవచ్చు. ఇక లాంగ్ రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇప్పుడు.