Home న్యూస్ విశాల్ రత్నం 3 డేస్ కలెక్షన్స్….మైండ్ బ్లాంక్ సామి!

విశాల్ రత్నం 3 డేస్ కలెక్షన్స్….మైండ్ బ్లాంక్ సామి!

0

కోలివుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ ను సొంతం చేసుకున్న హీరోలలో ఒకరైన విశాల్(Vishal) నటించిన లేటెస్ట్ మూవీ రత్నం(Rathnam) తమిళ్ తెలుగు లో రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ ఆడియన్స్ నుండి రాగా ఏ దశలో కూడా అంచనాలను అందుకోలేక పోయింది ఈ సినిమా…

రెండు రోజుల్లో మొత్తం మీద 6.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా అందుకున్న ఈ సినిమా తెలుగు లో 1.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. ఇక 3వ రోజు కూడా సినిమా పెద్దగా జోరు ఏమి చూపించ లేక పోయింది. తెలుగు లో మొత్తం మీద 65 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా తమిళ్ లో 2 కోట్ల లోపు గ్రాస్ ను మాత్రమె వసూల్ చేసింది.

మొత్తం మీద వీకెండ్ లో ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించ లేక పోయిన ఈ సినిమా వర్కింగ్ డేస్ లో ఏమైనా అద్బుతం చేస్తే తప్పితే బాక్స్ ఆఫీస్ దగ్గర తేరుకునే అవకాశం అయితే లేదని చెప్పాలి. ఒకసారి సినిమా 3 రోజుల్లో ఓవరాల్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే….

Rathnam Movie 3 Days Total Collections
👉Telugu States – 1.95Cr
👉Tamilnadu – 6.50Cr
👉Ka+ROI – 0.65Cr~
👉Overseas – 0.90CR~***
Total WW Collections – 10.00CR~ GROSS(4.80CR~ Share)

తెలుగులో సినిమా 1.05 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా వాల్యూ బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 3.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాలి. వరల్డ్ వైడ్ వాల్యూ బిజినెస్ రేంజ్ 25 కోట్ల దాకా ఉండగా సినిమా చాలా దూరం రన్ ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా వర్కింగ్ డేస్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here