సంక్రాంతికి కళ్యాణం కమనీయం సినిమాతో భారీ పోటిలో వచ్చి ఎవ్వరినీ పెద్దగా ఇంప్రెస్ చేయలేక పోయిన సంశోష్ శోభన్ ఆడియన్స్ ముందుకు నెల తిరగక ముందే శ్రీదేవి శోభన్ బాబు అంటూ మరో సినిమాతో వచ్చేశాడు…. టీసర్ ట్రైలర్ లు కొంచం రొటీన్ గానే ఉన్నా కలర్ ఫుల్ గా ఉండటంతో ఆడియన్స్ ను సినిమా ఇంప్రెస్ చేస్తుందేమో అనుకుంటే సినిమా శివరాత్రి వీకెండ్ లో రిలీజ్ అయ్యి అసలు ఏమాత్రం…
ఇంపాక్ట్ ని కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించలేక పోయింది. సినిమా మొదటి రోజే శివరాత్రి హాలిడే దొరికినా పెద్దగా వాడుకోలేక పోగా 20 లక్షల లోపే గ్రాస్ వసూళ్ళని అందుకోగా రెండో రోజు సినిమా సండే అడ్వాంటేజ్ ఉన్నా కూడా మొత్తం మీద 15 లక్షల లోపే గ్రాస్ ను…
సాధించగా మూడో రోజు సోమవారం కంప్లీట్ గా స్లో డౌన్ అయిపొయింది. మొత్తం మీద 3 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర 40 లక్షల లోపే గ్రాస్ ను అందుకోగా అందులో డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ లాంటివి తీసేస్తే షేర్ ఏమి ఉండకపోవచ్చు అని ట్రేడ్ వర్గాల సమాచారం.
అవేవి తీయకుండా చెప్పాలి అంటే 20 లక్షల లోపే షేర్ ని సినిమా అందుకోవచ్చు… మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సంతోష్ శోభన్ కి డీసెంట్ రిజల్ట్ ని అయినా ఇస్తుంది అనుకుంటే మరోసారి మైండ్ బ్లాంక్ చేస్తూ 3 రోజులకే వాషౌట్ అయ్యే పరిస్థితికి వచ్చేసింది.