Home Uncategorized 3 సినిమాలు 64 కోట్లు….2 సినిమాలు 267 కోట్లు…అరాచకం ఇది!!

3 సినిమాలు 64 కోట్లు….2 సినిమాలు 267 కోట్లు…అరాచకం ఇది!!

3

నట సింహం నందమూరి బాలకృష్ణ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ ఫ్లాఫ్స్ నుండి ఊహకందని అల్టిమేట్ ఎపిక్ కంబ్యాక్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కెరీర్ లో ఎన్నో హిట్స్ ఫ్లాఫ్స్ ఉన్నప్పటికీ ఇప్పుడు బాలయ్య పుట్టిన రోజు మాత్రం చాలా స్పెషల్ అనే చెప్పాలి.

కెరీర్ లో ఎప్పుడూ లేనిది ఈ బర్త్ డే టైంకి బాలకృష్ణ(Balakrishna) తన కెరీర్ లోనే ఆల్ టైం పీక్ స్టేజ్ లో క్రేజ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు అని చెప్పొచ్చు. కానీ ఇది ఎపిక్ కెరీర్ డౌన్ ఫాల్ తర్వాత రావడం మరింత స్పెషల్ అని చెప్పొచ్చు… 2019 టైంలో ఆడియన్స్ ముందుకు…

3 సినిమాలతో వచ్చాడు బాలయ్య… ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహా నాయకుడు మరియు రూలర్ సినిమాలతో… ఎన్టీఆర్ కథానాయకుడు టోటల్ రన్ లో 38.5 కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంటే ఎన్టీఆర్ మహా నాయకుడు మూవీ 8 కోట్ల గ్రాస్ ను అందుకుంది…

ఇక రూలర్ మూవీ 17.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా టోటల్ గా 3 సినిమాల గ్రాస్ 64 కోట్లు మాత్రమే అవ్వగా కెరీర్ లోనే లో స్టేజ్ ను మళ్ళీ చూసిన బాలయ్య తర్వాత అఖండ సినిమా ఎపిక్ కంబ్యాక్ ను సొంతం చేసుకుని 133.2 కోట్ల గ్రాస్ ను అందుకుని దుమ్ము లేపాడు.

ఇక ఈ ఇయర్ వీర సింహా రెడ్డి సినిమాతో 134 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా మాసివ్ కంబ్యాక్ లో ఏకంగా 2 సినిమాలతో 267 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని ఎపిక్ కంబ్యాక్ ని సొంతం చేసుకున్నాడు. ఇక త్వరలో బాలయ్య మూవీస్ వరుస పెట్టి రానుండగా ఆ సినిమాలతో మరింతగా జోరు చూపే అవకాశం ఉంది. ఇలాంటి పుట్టినరోజులు బాలయ్య మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలని కోరుకుంటూ పుట్టిన రోజు విషెస్ ను తెలియజేస్తున్నాం. మీరు కూడా మీ విషెస్ ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here