స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ల అల వైకుంఠ పురం లో బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి 2 రోజుల్లోనే భారీ మొత్తాన్ని వెనక్కి తీసుకు రాగా సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు లో అడుగు పెట్టగా భోగి హాలిడే అవ్వడం తో సినిమా మరింత జోరు గా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే రేంజ్ లో ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది.
ఓవరాల్ గా ఈ రోజు నుండి సినిమా కి మొత్తం మీద 500 వరకు థియేటర్స్ ఉండగా సినిమా అందులో 3 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద కేవలం 10% కి అటూ ఇటూ గా డ్రాప్స్ ని సొంతం చేసుకోగా అన్ని సెంటర్స్ లో 80% ఆక్యుపెన్సీ తో రన్ అవుతుంది.
ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల అడ్వాన్స్ బుకింగ్స్ మరో రేంజ్ లో దూసుకు పోతున్నాయి, దాంతో మూడో రోజు కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఉన్న స్టేటస్ ని బట్టి సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో…
మరోసారి అవలీలగా 8 కోట్ల నుండి 8.5 కోట్ల రేంజ్ షేర్ ని అందుకోవడం ఖాయం. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ అల్టిమేట్ గా ఉండటం తో ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అండ్ ఎక్స్ ట్రా షో లు అనుకున్నట్లు జరిగితే సినిమా మరో సారి రెండో రోజు లెవల్ లో కలెక్షన్స్ ని…
బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవడం ఖాయమని చెప్పాలి. ఈ రోజు కలెక్షన్స్ తో 50 కోట్ల షేర్ ని దాటనున్న సినిమా అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ కి తోడూ త్వరలోనే కెరీర్ లో నంబర్ 1 మూవీ గా నిలవడం ఆల్ మోస్ట్ కన్ఫాం. ఇక రోజు ముగిసే సరికి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తుందో చూడాలి.