Home న్యూస్ డియర్ కామ్రేడ్ డే 3 కలెక్షన్స్…ఇంతకుమించిన షాక్ లేదు!

డియర్ కామ్రేడ్ డే 3 కలెక్షన్స్…ఇంతకుమించిన షాక్ లేదు!

0

     రిలీజ్ కి ముందు ఎంత పాజిటివ్ బజ్ ఉన్నా కానీ రిలీజ్ అయిన తర్వాత పాజిటివ్ టాక్ ఉంటేనే ఏ సినిమా కైనా కలెక్షన్స్ స్టడీ గా ఉంటాయి, మొదటి రోజు వరకు స్టార్ పవర్, సినిమా క్రేజ్ దృశ్యా ఓపెనింగ్స్ రావడం కామన్, కానీ రెండో రోజు నుండి సినిమా టాక్ మాత్రమె కలెక్షన్స్ రావడం లో ఉపయోగ పడుతుంది, రీసెంట్ గా వచ్చిన విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ సినిమా..

మొదటి రోజు ఓపెనింగ్స్ వరకు విజయ్ క్రేజ్ అలాగే సినిమా పాజిటివ్ బజ్ వలన మంచి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది, కానీ రెండో రోజే షాక్ ఇచ్చే రేంజ్ లో కేవలం 3 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ని మాత్రమె అందుకున్న సినిమా మూడో రోజు మరింత షాక్ ఇచ్చేలా కనిపిస్తుంది.

   

మూడో రోజు ఓపెనింగ్స్ నుండి రెండో రోజు తో పోల్చితే భారీ డ్రాప్స్ కనిపించగా ఈవినింగ్ అండ్ నైట్ షోల కి వచ్చే సరికి కొన్ని క్లాస్ సెంటర్స్ లో కొంచం బెటర్ గా హోల్డ్ చేసినప్పటికీ మాస్ సెంటర్స్ లో సినిమా పరిస్థితి ఊహాతీతంగా మారింది అని చెప్పాలి. రోజు మొత్తం మీద ఆక్యుపెన్సీ…

కేవలం 25% లోపే ఉందని చెప్పాలి. దాంతో సినిమా 3 వ రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే చాన్స్ ఉంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అన్ని సెంటర్స్ లో ట్రాక్ కాలేదు కాబట్టి అక్కడ బాగుంటే సినిమా 2.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు.

ఇది సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 34.6 కోట్ల ని అందుకోవడానికి ఏమాత్రమ్ సరిపోదనే చెప్పాలి, సినిమా ఎంతలేదన్నా 5 కోట్ల లెవల్ లో కలెక్షన్స్ ని సాధిస్తే రేసులో ఉండేది, మరి అఫీషియల్ గా మొదటి వీకెండ్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here