బాక్స్ ఆఫీస్ దగ్గర విక్టరీ వెంకటేష్ నాగ చైతన్య ల వెంకి మామ జోరు ఓ రేంజ్ లో కొనసాగుతుంది, సినిమా మొదటి రోజు 8.93 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకుని సత్తా చాటుకోగా రెండో రోజు 6.08 కోట్ల షేర్ ని సాధించి దుమ్ము లేపింది. దాంతో 2 రోజుల్లో 15 కోట్ల మార్క్ ని అధిగమించిన ఈ సినిమా ఇప్పుడు మూడో రోజు లో ఎంటర్ అయింది, బాక్స్ ఆఫీస్ దగ్గర ఆదివారం అవ్వడం తో…
సినిమా జోరు ఓ రేంజ్ లో ఉందని చెప్పొచ్చు. ఆ రేంజ్ ఏ లెవల్ లో ఉందీ అంటే సినిమా రెండో రోజు తో పోల్చితే బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల డ్రాప్స్ కేవలం 5 నుండి 10% లోపు మాత్రమె ఉండటం ఇక్కడ విశేషం అని చెప్పాలి.
దానికి తోడూ ఈవినింగ్ అండ్ నైట్ షోల ఆన్ లైన్ బుకింగ్స్ ఓ రేంజ్ లో జరుగుతున్నాయి, రెండు నెలలకు పైగా పెద్ద సినిమాలు లేకపోవడం ఇప్పుడు వెంకి మామ రావడం తో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా భారీ సంఖ్య లో థియేటర్స్ కి తరలి వస్తున్నారు.
దాంతో అన్ సీజన్ అయినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ ఓపెనింగ్స్ తో దూసుకు పోతున్న వెంకిమామ మూడో రోజు ఓపెనింగ్స్ ని బట్టి చూస్తుంటే రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ రోజు అవలీలగా 4 కోట్ల నుండి 4.5 కోట్ల రేంజ్ షేర్ ని అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పొచ్చు.
ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల అడ్వాన్స్ బుకింగ్స్ ని బట్టి చూస్తుంటే ఈ లెక్క మరింత ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా అనుకున్న రేంజ్ లో ఉంటె ఈ రోజు వెంకి మామ బాక్స్ ఆఫీస్ భీభత్సం మరో లెవల్ లో ఉండటం ఖాయమని చెప్పొచ్చు. మరి డే ఎండ్ కి సినిమా స్టేటస్ ఎలా ఉందో మరో ఆర్టికల్ లో అప్ డేట్ చేస్తాం.