బాక్స్ ఆఫీస్ దగ్గర దసరా వీకెండ్ తర్వాత బాక్స్ ఆఫీస్ స్లో డౌన్ అయింది, ప్రతీ వీకెండ్ రిలీజ్ అయ్యేవి చిన్న సినిమాలే అవ్వడంతో కలెక్షన్స్ అన్ని సినిమాలకు మరీ అనుకున్న రేంజ్ లో అయితే రావడం లేదు అని చెప్పాలి. ఈ వీకెండ్ 2 సినిమాలు ఆడియన్స్ ముందుకు రాగా 2 సినిమాల్లో పర్వాలేదు అనిపించే టాక్ వచ్చిన వరుడు కావలెను కలెక్షన్స్ కోసం కష్టాలు పడుతుంది, మరో పక్క నెగటివ్ టాక్ ని…
సొంతం చేసుకున్న రొమాంటిక్ మూవీ కలెక్షన్స్ పరంగా మరీ భీభత్సం ఏమి కాదు కానీ డీసెంట్ వసూళ్ళతో రన్ అవుతూ ఉండగా మూడో రోజు లో ఎంటర్ అయిన 2 సినిమాలలో రొమాంటిక్ మూవీ యూత్ ని బాగానే థియేటర్స్ కి రప్పిస్తూ ఉండగా మాస్ సెంటర్స్ లో కూడా సినిమా…
డీసెంట్ హోల్డ్ నే సొంతం చేసుకుంది. ఇక వరుడు కావలెను సినిమా అర్బన్ ఆడియన్స్ ని కొంత వరకు థియేటర్స్ కి రప్పిస్తున్నా ఓవరాల్ గా మాస్ అండ్ యూత్ ఆడియన్స్ ను ఏమాత్రం థియేటర్స్ లోకి రప్పించ లేక పోతుంది ఈ సినిమా… ఇక మూడో రోజు రెండు సినిమాలలో…
రొమాంటిక్ పర్వాలేదు అనిపించే విధంగా హోల్డ్ చేయగా రెండో రోజు తో పోల్చితే 20-25% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఓవరాల్ గా ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 50-55 లక్షల రేంజ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవచ్చు, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే 60 లక్షల రేంజ్ కి వెళ్ళొచ్చు. అంతకుమించి వస్తే సాలిడ్ గా హోల్డ్ చేసింది అని చెప్పొచ్చు.
ఇక వరుడు కావలెను సినిమా మూడో రోజు ఆల్ మోస్ట్ 20% వరకు డ్రాప్ అవ్వగా సినిమా ఈ రోజు 35-40 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే 45 లక్షల రేంజ్ కి వెళ్ళొచ్చు. రెండు సినిమాలకు నైట్ షోలకు ఇండియా న్యూజిలాండ్ క్రికెట్ మ్యాచ్ ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ ఉంది, మరి 2 సినిమాలు అఫీషియల్ ఎలా హోల్డ్ చేస్తాయో చూడాలి.