సెకెండ్ ఎఫెక్ట్ నుండి తెలుగు రాష్ట్రాలు చాలా వరకు కోలుకుంటున్నా కానీ ఇతర రాష్ట్రాల పరిస్థితి ఇంకా సెట్ అవ్వడం లేదు, తమిళనాడు లో పరిస్థితులు ఇంకా మెరుగు అవ్వాల్సిన అవసరం ఉండగా అక్కడ ఆంక్షలను ఇంకా అమలులోనే ఉంచింది అక్కడ ప్రభుత్వం, ఇక ఇంకా ఆంక్షలు ఉండటం తో థియేటర్స్ లో తిరిగి రిలీజ్ అవ్వాలని ఆలోచించిన కొన్ని సినిమాలు తిరిగి డిజిటల్ లో రిలీజ్ వైపు అడుగులు వేస్తున్నయట.
కోలివుడ్ నుండి ఇప్పటికే కొన్ని సినిమాలు డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకోగా థియేటర్స్ లో రిలీజ్ అవ్వాలని తెగ ట్రై చేసినా సెట్ అవ్వక పోవడం తో డిజిటల్ వైపు అడుగులు వేసి మళ్ళీ పరిస్థితులు నార్మల్ అవుతున్నాయని తెలిసి తిరిగి థియేటర్స్ వైపు…
ఆలోచించిన సినిమా శివ కార్తికేయన్ నటించిన డాక్టర్ మూవీ, ప్రియాంక అతుల్ మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా పై మంచి బజ్ ఉండగా ఈ సినిమా థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలనీ అనుకున్నారు కానీ ఇప్పుడు ఇంకా టైం పట్టేలా ఉండటం తో ఇక తప్పక సినిమాను డిజిటల్ లోనే…
రిలీజ్ చేయాలనీ చూస్తున్నారట ఇప్పుడు. ఇది వరకు ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కోసం 40 కోట్ల రేంజ్ లో రేటు ఆఫర్ రాగా ఇప్పుడు ఆ రేటుని ఇంకాస్త పెంచి 42 కోట్ల రేటు కి సినిమా రైట్స్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వాళ్ళు సొంతం చేసుకోబోతున్నారు అన్తూ కోలివుడ్ లో వార్తలు సాలిడ్ గా శిఖారు చేస్తున్నాయి. అక్కడ ఇది ఓవరాల్ గా…
ధనుష్ నటించిన జగమే తంత్రం సినిమా అలాగే సూర్య నటించిన ఆకాశం నీ హద్దు రా సినిమాల తర్వాత మూడో హైయెస్ట్ డిజిటల్ రిలీజ్ రేటు గా చెబుతున్నారు. మేకర్స్ ఆల్ మోస్ట్ డీల్ ని క్లోజ్ చేసినట్లే నని త్వరలోనే సినిమా పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఉండబోతుంది అంటూ చెబుతున్నారు ఇప్పుడు.