Home న్యూస్ ప్రిన్స్ మూవీ డిజిటల్ రిలీజ్ డేట్ ఫిక్స్….ఎప్పుడంటే!!

ప్రిన్స్ మూవీ డిజిటల్ రిలీజ్ డేట్ ఫిక్స్….ఎప్పుడంటే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర దీపావళి వీకెండ్ లో రిలీజ్ అయిన శివకార్తికేయన్ నటించిన ప్రిన్స్ మూవీ అంచనాలను అందుకోవడంలో విఫలం అవ్వగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళ్ అలాగే తెలుగు రెండు చోట్లా కూడా భారీగా నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకుంది. మొదటి వీకెండ్ తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర తేరుకోలేక పోయిన ఈ సినిమా శివకార్తికేయన్ కెరీర్ లో రీసెంట్ టైం లో భారీ ఫ్లాఫ్ మూవీగా…

నిలిచి నిరాశ పరిచింది. కాగా సినిమా బాక్స్ ఆఫీస్ రన్ ఆల్ మోస్ట్ ఎండ్ అవ్వగా సినిమా ఇప్పుడు డిజిటల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉంది. సినిమా డిజిటల్ రైట్స్ ని భారీ రేటు చెల్లించి ముందే సొంతం చేసుకున్న…

హాట్ స్టార్ లో ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన 5 వారాల తర్వాత డిజిటల్ రిలీజ్ కానుంది, అంటే ఈ నెల్ 25న సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డిజిటల్ రిలీజ్  అన్ని భాషల్లో కానున్నట్లు సమాచారం. ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచినా కానీ…

నాన్ థియేట్రికల్ బిజినెస్ ఈ సినిమా కి సాలిడ్ గానే జరగడంతో నిర్మాతలు ఓవరాల్ గా ప్రాఫిట్ జోన్ లోనే ఉన్నారని చెప్పాలి. కానీ బాక్స్ ఆఫీస్ రిజల్ట్ మాత్రం ఇంకొంచం బెటర్ గా ఎక్స్ పెర్ట్ చేస్తే సినిమా అంచనాలను అందుకోలేక విఫలం అయిపొయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here