Home న్యూస్ 3rd డే జైలర్ కలెక్షన్స్….రజినీ బాక్స్ ఆఫీస్ వీరంగం!!

3rd డే జైలర్ కలెక్షన్స్….రజినీ బాక్స్ ఆఫీస్ వీరంగం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర జైలర్(Jailer Movie) తో సెన్సేషనల్ కంబ్యాక్ ఇచ్చిన సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) అన్ని చోట్లా ఊరమాస్ కలెక్షన్స్ తో లాంగ్ వీకెండ్ లో కలెక్షన్స్ వీరంగం సృష్టిస్తూ దూసుకు పోతున్నాడు. సినిమా తెలుగులో రెండో రోజు పోటి వలన…

కొంచం డ్రాప్ అయినా మూడో రోజు హౌస్ ఫుల్ షోలతో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు. ఆల్ మోస్ట్ డే 2 మీద ట్రాక్ చేసిన సెంటర్స్ లో 40-50% వరకు టికెట్ సేల్స్ లో గ్రోత్ కనిపిస్తూ ఉండగా…

ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో కూడా ఈ జోరు కొనసాగుతూ ఉండటంతో మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇప్పుడు 4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించిపోతే 4.3 కోట్ల మార్క్ ని కూడా దాటవచ్చు.

ఇక తమిళ్ లో ఈ రోజు మరోసారి 18 కోట్ల రేంజ్ లో గ్రాస్ అందుకునే అవకాశం ఉండగా కర్ణాటకలో 6.5-7 కోట్లకు పైగా గ్రాస్ ను కేరళలో 4.5 కోట్లకు పైగా గ్రాస్ ను ఓవర్సీస్ లో 3 మిలియన్స్ కి పైగా గ్రాస్ ను ఈ రోజు సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది…

దాంతో మూడో రోజు మొత్తం మీద సినిమా వరల్డ్ వైడ్ గా 56 కోట్ల నుండి 60 కోట్ల దాకా గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ గా ఆఫ్ లైన్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉంది. ఇక టోటల్ గా 3 రోజుల కలెక్షన్స్ లెక్క ఏ విధంగా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here