రెండేళ్ళ క్రితం వచ్చిన KGF సినిమా ఎంత సైలెంట్ గా రిలీజ్ అయ్యిందో అంతే వైలేంట్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. సినిమా కన్నడ పరిశ్రమ తరుపున మొట్ట మొదటి 100 నుండి 200 కోట్ల మార్క్ ని అందుకున్న సినిమా గా చరిత్ర సృష్టించింది. హిందీ లో కూడా ఏకంగా 45 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్స్ ని వసూల్ చేసింది.
అలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సినిమాను ఎవరైనా త్వరగా టెలికాస్ట్ చేసి మంచి రేటింగ్స్ ని సొంతం చేసుకోవాలని చూస్తారు కానీ తెలుగు లో సినిమా శాటిలైట్ రైట్స్ చాలా ఆలస్యంగా అమ్ముడు అయ్యాయి. ఆల్ మోస్ట్ రిలీజ్ అయిన ఏడాదిన్నర తర్వాత స్టార్ మా వారు సినిమా ను…
సుమారు 4.5 కోట్ల రేటు చెల్లించి శాటిలైట్ రైట్స్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం… కాగా లేట్ గా టెలికాస్ట్ అయినా కానీ సినిమా కి మంచి TRP రేటింగ్ దక్కింది అని చెప్పాలి కానీ లేట్ టెలికాస్ట్ వల్ల రికార్డ్ బ్రేకింగ్ రేటింగ్స్ ని మిస్ చేసుకుంది ఈ సినిమా..
రీసెంట్ గా టెలికాస్ట్ అయిన ఈ సినిమా కి ఓవరాల్ గా 11.9 TRP రేటింగ్ దక్కింది…. ఇది మరీ అద్బుతం కాదు కానీ అదే సమయంలో లేట్ టెలికాస్ట్ అయినా కానీ మంచి రేటింగ్ నే సినిమా సొంతం చేసుకుంది అని చెప్పాలి. పక్కా మాస్ మూవీ అవ్వడం తో ఫ్యామిలీ ఆడియన్స్ యూత్ అంత ఆసక్తిని…
ఈ సినిమా పై చూపి ఉండరు కానీ యూత్ మళ్ళీ ఒకసారి చూడటం వల్ల ఆ TRP రేటింగ్ దక్కింది అని చెప్పాలి. ఇక మొదటి పార్ట్ సాధించిన విజయం తో రెండో పార్ట్ పై అంచనాలు పీక్స్ లో ఉండగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ఇయర్ సెకెండ్ ఆఫ్ ఎండ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఇది నిజం అవుతుందో లేదో చూడాలి…