Home న్యూస్ 4 సినిమాల టోటల్ థియేటర్స్…ఉప్పెన 2nd వీక్ థియేటర్స్ ఎన్నో తెలుసా?

4 సినిమాల టోటల్ థియేటర్స్…ఉప్పెన 2nd వీక్ థియేటర్స్ ఎన్నో తెలుసా?

0

ఫిబ్రవరి 19 న ఏకంగా 4 కొత్త సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేయడానికి సిద్ధం అయ్యాయి. వాటిలో రెండు స్ట్రైట్ తెలుగు సినిమాలు కాగా మరో 2 డబ్బింగ్ మూవీస్. ఈ నాలుగు సినిమాలు ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ రన్ ని కొనసాగిస్తున్న ఉప్పెన సినిమా తో రెండో వారంలో పోటి పడాల్సి వచ్చింది. ఒకసారి కొత్త సినిమాలతో పాటు ఉప్పెన సినిమా కి రెండో వారం ఎన్నో థియేటర్స్ ఇచ్చారో గమనిస్తే…

ముందుగా కొత్త సినిమాలను గమనిస్తే… నైజాం ఏరియాలోనే చూసుకుంటే అల్లరి నరేష్ నాంది సినిమా కి 74 థియేటర్స్ ని ఇచ్చారు. ఇక సుమంత్ కపటధారి సినిమా కి 74 థియేటర్స్ ని ఇవ్వగా విశాల్ చక్ర మూవీ కి 145 థియేటర్స్ ని కేటాయించారు.. ఇక మరో డబ్బింగ్ మూవీ…

పొగరు కి 97 థియేటర్స్ ని ఇచ్చారు. ఇక ఇదే టైం లో ఉప్పెన సినిమా రెండో వారం నైజాం ఏరియాలో 190 థియేటర్స్ లో పరుగును కొనసాగిస్తుంది. ఇక అన్ని సినిమాల టోటల్ థియేటర్స్ కౌంట్ ని గమనిస్తే… నాంది సినిమా కి రెండు తెలుగు రాష్ట్రాల్లో… 225 థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

ఇక సుమంత్ కపటధారి సినిమా కి 210 థియేటర్స్ ని కేటాయించగా, డబ్బింగ్ మూవీస్ లో చక్ర సినిమా కి 410 థియేటర్స్ ని కేటాయించారు, ఇక పొగరు సినిమా కి గాను 250 థియేటర్స్ ని ఇవ్వగా ఈ నాలుగు సినిమాలు కలిపి టోటల్ గా 1090 థియేటర్స్ లో రెండు తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ కానున్నాయి.. అందులో ఒక నైజాంలోనే 390 థియేటర్స్ లో రిలీజ్ కానున్నాయి.

Uppena 7 Days Total World Wide Collections

ఇక ఉప్పెన సినిమా రెండో వారం థియేటర్స్ విషయానికి వస్తే… నైజాంలో 190 సీడెడ్ లో 75 థియేటర్స్ లో టోటల్ ఆంధ్రలో 210 థియేటర్స్ లో హోల్డ్ చేయగా రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ఆల్ మోస్ట్ 475 థియేటర్స్ లో పరుగును రెండో వారం కొనసాగిస్తుంది. ఇప్పటికీ అన్ని సినిమాల్లో హైయెస్ట్ థియేటర్స్ ఉప్పెన కే ఉన్నాయి. ఇక అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పెర్ఫార్మ్ చేస్తాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here