బాక్స్ ఆఫీస్ దగ్గర 2024 ఇయర్ లో వచ్చిన సినిమాలలో వన్ ఆఫ్ ది బెస్ట్ లాంగ్ రన్ ను ఎంజాయ్ చేసిన సినిమాల్లో టాలీవుడ్ మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ దేవర(Devara part 1) ముందు నిలిచే సినిమా అని చెప్పాలి. మొదటి రోజు సినిమాకి వచ్చిన టాక్ కి ఇక తేరుకోవడం…
కష్టమే అని అందరూ అనుకున్నా కూడా ఊహకందని లాంగ్ రన్ ను ఎంజాయ్ చేసిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి టోటల్ రన్ లో ఏకంగా 450 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుని దుమ్ము దులిపేసింది…
ఇక సినిమా 50 రోజులను రీసెంట్ టైంలో నే వన్ ఆఫ్ ది హైయెస్ట్ థియేటర్స్ లో సొంతం చేసుకుని మరో రచ్చ చేసింది…ఏకంగా 54 సెంటర్స్ లో 50 రోజులను పూర్తి చేసుకుని రీసెంట్ టైంలో బెస్ట్ రన్ తో మాస్ ఊచకోత కోసిన తర్వాత కూడా లాంగ్ రన్ ను కొన్ని థియేటర్స్ లో…
సొంతం చేసుకున్న సినిమా ఇప్పుడు 100 రోజులను దిగ్విజయంగా పూర్తి చేసుకుని మాస్ రచ్చ చేసింది….అది కూడా ఒకటి అరా సెంటర్స్ కాదు…ఏకంగా 6 సెంటర్స్ లో 100 రోజులను పూర్తి చేసుకుని మాస్ ఊచకోత కోసింది ఇప్పుడు….
ఈస్ట్ గోదావరి లో 2 సెంటర్స్ లో గుంటూరు లో ఒక సెంటర్ లో చిత్తూర్ లో 3 సెంటర్స్ లో సినిమా ఓవరాల్ గా 100 రోజులను కంప్లీట్ చేసుకుని రీసెంట్ టైంలో 50 రోజుల పరంగా అలాగే 100 రోజుల పరంగా ఒకప్పటి రోజులను గుర్తు చేస్తూ…
డీసెంట్ థియేటర్స్ లో మాస్ హోల్డ్ ని చూపించింది. సినిమాకి మొదటి రోజు వచ్చిన టాక్ ని దృష్టిలో పెట్టుకుని అటు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇటు థియేటర్స్ లో సినిమా రన్ ని చూస్తె…దేవర తో తన స్టార్ పవర్ ఏ రేంజ్ లో ఉందో ఎన్టీఆర్ చెప్పకనే చెప్పాడు అని చెప్పాలి. ఇక 2025 లో వార్ 2 తో ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చూడాలి.