దసరా కొత్త సినిమాలు అన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ ని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వర్కింగ్ డే టెస్ట్ లో ఎంటర్ అయ్యాయి. కాగా అన్ని సినిమాలకు వర్కింగ్ డే ఇంపాక్ట్ గట్టిగానే పడింది.. నార్మల్ వీకెండ్ తర్వాత వర్కింగ్ డే డ్రాప్స్ మీడియంగా ఉంటాయి కానీ పండగ వీకెండ్ తర్వాత వర్కింగ్ డే కి జనాలు ఊర్ల నుండి సిటీలకు వెళ్ళే పనిలో ఉంటారు కాబట్టి కలెక్షన్స్ పై ఇంపాక్ట్ గట్టిగానే ఉంటుంది.
బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజుల క్రితం మంచి అంచనాల నడుమ రిలీజ్ అయ్యి వీకెండ్ కలెక్షన్స్ పరంగా చేతులు ఎత్తేసిన మహా సముద్రం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 వ రోజు లో భారీ డ్రాప్స్ ను సొంతం చేసుకుంది, వీకెండ్ లో వీక్ పెర్ఫార్మెన్స్ వలన థియేటర్స్ ని కూడా…
తగ్గించారు ఈ సినిమాకి… ఆ ఇంపాక్ట్ కూడా పడి మొత్తం మీద ఇప్పుడు 5 వ రోజు 30-35 లక్షల లోపు కలెక్షన్స్ ని అందుకునేలా ఉంది ఈ సినిమా. ఇక చిన్న సినిమా పెళ్లి సందD తక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఇప్పుడు వర్కింగ్ డే లో మహా సముద్రం…
థియేటర్స్ ని చాలా చోట్ల సొంతం చేసుకున్నా ఓవరాల్ డ్రాప్స్ 50% రేంజ్ లో ఉండగా ఈ రోజు సినిమా 50-60 లక్షల లోపు కలెక్షన్స్ ని సొంతం చేసుకోవచ్చు. ఇక అఖిల్ అక్కినేని నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వర్కింగ్ డే లో ఇతర సినిమాల మాదిరిగానే ఆల్ మోస్ట్ 55% డౌన్ అయింది… కొన్ని చోట్ల ఇంకా కొంచం డ్రాప్స్ ఎక్కువగానే ఉన్నప్పటికీ…
తిరిగి ఈవినింగ్ అండ్ నైట్ షోలకు పర్వాలేదు అనిపించేలా పుంజుకున్న ఈ సినిమా ఇప్పుడు 4 వ రోజు మినిమం 1.5 కోట్ల నుండి 1.8 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది. అన్ని చోట్ల ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది. మరి అన్ని సినిమాలు అఫీషియల్ వర్కింగ్ డే లో ఎలా పెర్ఫార్మ్ చేస్తాయో చూడాలి…