బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ ని సెన్సేషనల్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకున్న అవతార్2 సినిమా ఇండియా తో పాటు వరల్డ్ వైడ్ గా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా ఇప్పుడు వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయిన సినిమా 4వ రోజు ఇండియాలో హెవీ డ్రాప్స్ నే సొంతం చేసుకుంది అని చెప్పాలి. వర్కింగ్ డే అవ్వడంతో ఇలాంటి డ్రాప్స్ నార్మల్ అనే చెప్పాలి కానీ…
సినిమా మీద ఉన్న హైప్ కి ఇంకా బెటర్ గా హోల్డ్ చేసి ఉండాల్సింది. మొత్తం మీద 50-60% రేంజ్ లో సినిమా డ్రాప్స్ ఉన్నాయి అన్ని చోట్లా కూడా.. తెలుగు లో సినిమా ఆల్ మోస్ట్ 60% రేంజ్ లో డ్రాప్ అవ్వగా ఈవినింగ్ షోలకు కొద్ది వరకు…
గ్రోత్ ని సొంతం చేసుకున్న సినిమా మొత్తం మీద ఇప్పుడు తెలుగు లో 4 కోట్ల నుండి 4.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తుంది. అన్ని చోట్లా నైట్ షోల బుకింగ్స్ స్టడీగా ఉంటె 5 కోట్ల దాకా వెళ్ళే అవకాశం కొద్ది వరకు ఉంది. ఇక ఇండియాలో ఈ రోజు సినిమా అటూ ఇటూగా 16-17 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది.
అలాగే గ్రాస్ 25 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉంది, అన్ని చోట్లా నైట్ షోల బుకింగ్స్ బాగుంటే ఈ కలెక్షన్స్ కొంచం పెరగవచ్చు, ఓవరాల్ గా వర్కింగ్ డే లో డీసెంట్ హోల్డ్ కానీ ట్రేడ్ వర్గాలు ఇంకొంచం ఎక్కువగానే ఎక్స్ పెర్ట్ చేశారని చెప్పాలి. మరి అఫీషియల్ 4 డేస్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.