బాక్ టు బాక్ డిసాస్టర్లు పడ్డా కూడా రిమార్కబుల్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేస్తున్న యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమా అన్ని చోట్లా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఊహకందని ఊచకోత కోసింది. ఇక వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టిన సినిమా..
అన్ని చోట్లా ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేసింది అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారగా సినిమా ఓవరాల్ గా సండే టు మండే ని కంపేర్ చేస్తే ఓవరాల్ గా 60% రేంజ్ లో డ్రాప్స్ ను అయితే మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు చూపించింది అని చెప్పాలి ఇప్పుడు… కానీ మ్యాట్నీ షోల నుండి కొద్ది కొద్దిగా..
గ్రోత్ ని అయితే చూపెడుతూ ఉండటంతో సినిమా ఇదే ట్రెండ్ ని ఈవినింగ్ అండ్ నైట్ షోలకు కూడా కొనసాగించగలిగితే ఓవరాల్ గా సినిమా రోజును మంచి కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి… ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రజెంట్ ట్రెండ్ ను చూస్తూ ఉంటే..
4వ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 3 కోట్ల రేంజ్ నుండి 3.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా, ఈవినింగ్ అండ్ నైట్ షోలకు ఏమైనా గ్రోత్ ని కనుక చూపిస్తే గ్రోత్ మరికొంత పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. ఇక కర్నాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో సినిమా…
బాగానే హోల్డ్ చేస్తూ ఉండగా ఓవర్సీస్ లో కొంచం డ్రాప్స్ ఎక్కువగా ఉండగా నాలుగో రోజు వరల్డ్ వైడ్ గా 4 కోట్ల రేంజ్ లో షేర్ ని టార్గెట్ చేసింది అని చెప్పాలి. ఇక డే 4 ఎండ్ అయ్యే టైంకి సినిమా ఈ మార్క్ ని అందుకుంటుందో లేక మించిపోయే అవకాశం ఏమైనా ఉంటుందో చూడాలి ఇప్పుడు.