బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపిన సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ విరూపాక్ష సినిమా వీకెండ్ తర్వాత ఇప్పుడు 4వ రోజు వర్కింగ్ డే లో ఎంటర్ అవ్వగా సినిమా 3వ రోజుతో పోల్చితే ఇప్పుడు 4వ రోజు 60% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కానీ తిరిగి ఈవినింగ్ అండ్ నైట్ షోలలో….
మంచి హోల్డ్ నే చూపిస్తూ ఉండగా మొత్తం మీద ముందు 2.2 కోట్ల రేంజ్ లో షేర్ అనుకున్నా ఇప్పుడు పెరిగిన కొంచం గ్రోత్ వలన సినిమా అటూ ఇటూ గా 2.4 కోట్ల నుండి 2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు….
అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలు తప్పితే తప్ప ఈ రేంజ్ లోనే కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 4వ రోజున 3 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు.
ఓవరాల్ గా వీకెండ్ తర్వాత వర్కింగ్ డే లో ఇవి మంచి కలెక్షన్స్ అనే చెప్పాలి. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలు మించి పోతే ఈ కలెక్షన్స్ ని కొద్ది వరకు మించే అవకాశం ఉంది. ఇక టోటల్ గా 4 రోజులకు గాను సినిమా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి…