Home న్యూస్ 4 సార్లు 500 కోట్లు….సామి శిఖరం!!

4 సార్లు 500 కోట్లు….సామి శిఖరం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా రేంజ్ లో అల్టిమేట్ క్రేజ్ ను సొంతం చేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) తర్వాత వరుస పెట్టి పాన్ ఇండియా మూవీస్ ని చేస్తూ తన రేంజ్ ని సినిమా సినిమాకి పెంచుకుంటూ ఇతర ఇండస్ట్రీలలో కూడా స్ట్రాంగ్ మార్కెట్ ను సొంతం చేసుకున్నాడు…బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ నుండి వచ్చిన సినిమాల్లో…

యునానిమస్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సినిమాగా ఇప్పుడు కల్కి 2898AD(Kalki2898AD Movie) అల్టిమేట్ కలెక్షన్స్ తో అన్ని చోట్లా దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోగా రీసెంట్ గా ఈ సినిమా 500 కోట్ల మమ్మోత్ గ్రాస్ మార్క్ ని క్రాస్ చేసి సంచలనం సృష్టించడం విశేషం…

కాగా టాలీవుడ్ తరుపున ఆల్ రెడీ ఎవ్వరికీ అందనంత ఎత్తులో సరికొత్త రికార్డులను నమోదు చేసిన ప్రభాస్ ఏ హీరోకి అందనంత ఎత్తులో 4 సార్లు బాక్స్ ఆఫీస్ దగ్గర 500 కోట్ల ఎపిక్ గ్రాస్ ను మార్క్ ని సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోయగా సౌత్ లో కూడా ఇది బిగ్గెస్ట్ రికార్డ్ అని చెప్పాలి…

అదే టైంలో ఇండియన్ మూవీస్ పరంగా కూడా బాలీవుడ్ ఖాన్స్ ని కూడా మించే విధంగా జోరు చూపించిన ప్రభాస్ 4 మూవీస్ తో రికార్డ్ 500 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకోగా అమీర్ ఖాన్ హీరోగా 3 సినిమాలతో తర్వాత ప్లేస్ లో నిలిచాడు…తర్వాత సల్మాన్ ఖాన్ కూడా 3 సినిమాలతో నిలవగా…

ప్రభాస్ మాత్రం ఏకంగా 4 సినిమాలతో వరల్డ్ వైడ్ గా 500 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని ఎపిక్ ఇండియన్ రికార్డ్ ను సృష్టించి సామి శిఖరం అనిపించుకున్నాడు. ఇదే రేంజ్ లో కల్కి మూవీ లాంగ్ రన్ లో జోరు చూపిస్తే మరిన్ని ఎపిక్ రికార్డులు బాక్స్ ఆఫీస్ దగ్గర నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here