Home న్యూస్ 50 కోట్ల సినిమా…4 వారాలు అయినా ఆగని కలెక్షన్స్ జాతర!!

50 కోట్ల సినిమా…4 వారాలు అయినా ఆగని కలెక్షన్స్ జాతర!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ లో రీసెంట్ టైం లో అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాలు ఏవి కూడా రాలేదు, ఇలాంటి టైం లో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగిన దృశ్యం2 సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఇప్పటికీ లాంగ్ రన్ ని సొంతం చేసుకుంటూ ఇప్పుడు 4 వారాలను పూర్తీ చేసుకున్నా కానీ కలెక్షన్స్ పరంగా ఎక్స్ లెంట్ జోరు ని చూపిస్తూ….

ఇప్పటికీ కూడా ఊచకోత కోసే కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఉండటం విశేషం. సినిమాను కేవలం 50 కోట్ల రేంజ్ బడ్జెట్ లో తెరకెక్కించగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 వారాలు పూర్తీ అయ్యే టైం కి 216 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని…

సొంతం చేసుకోగా 28వ రోజు సినిమా 1.3 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుని ఇప్పటికీ జోరు చూపిస్తుండటం విశేషం అని చెప్పాలి. ఇక సినిమా టోటల్ ఓవర్సీస్ లో 52 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా టోటల్ గా 4 వారాలు పూర్తీ అయ్యే టైంకి…

వరల్డ్ వైడ్ గా 306 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఊచకోత కోస్తూ దూసుకు పోతుంది.. సినిమా ఊపు చూస్తుంటే లాంగ్ రన్ ని ఇంకా కొనసాగించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. 50 కోట్ల బడ్జెట్ మీద ఊహకందని లాభాలను ఈ సినిమా సొంతం చేసుకోబోతుంది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here