Home న్యూస్ 150 కోట్లు ఔట్….ఇక్కడ దెబ్బకొట్టినా అక్కడ మాత్రం ఊచకోత!!

150 కోట్లు ఔట్….ఇక్కడ దెబ్బకొట్టినా అక్కడ మాత్రం ఊచకోత!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర దృశ్యం సినిమా మలయాళంలో అలాగే తెలుగు లో సూపర్ హిట్ అయిన సినిమాలు, అలాంటి సినిమాకి సీక్వెల్ గా వచ్చిన దృశ్యం 2 సినిమాను ముందు మలయాళంలో డిజిటల్ లో డైరెక్ట్ గా రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చినా థియేటర్స్ లో రిలీజ్ చేసి ఉంటే మరో లెవల్ లో ఉండేది అన్న కామెంట్స్ వచ్చాయి. తర్వాత తెలుగు లో కూడా రీమేక్ అయిన దృశ్యం2 థియేటర్స్ లోకి…

వస్తుంది అనుకున్నా కానీ అలాంటిది జరగలేదు, సినిమా డైరెక్ట్ గా డిజిటల్ లో రిలీజ్ అవ్వాల్సి వచ్చింది. కానీ హిందీ లో మాత్రం దృశ్యం2 ని ఎట్టి పరిస్థితులలో కూడా థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని డిసైడ్ అవ్వగా రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ సినిమా..

అక్కడ కలెక్షన్స్ వర్షం కురిపిస్తూ దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది. సినిమా రెండో వీకెండ్ లో కొత్త సినిమాల కన్నా కూడా బెటర్ కలెక్షన్స్ ని సాధించగా ఇప్పుడు టోటల్ గా 11 రోజులు పూర్తీ అయ్యే టైం కి ఆల్ మోస్ట్ అక్కడా 150 కోట్ల రేంజ్ లో…

నెట్ కలెక్షన్స్ ని అందుకుని 200 కోట్ల మార్క్ వైపు ఇప్పుడు పరుగులు తీస్తుంది. సినిమా కి వర్కింగ్ డేస్ లో కూడా వస్తున్న రెస్పాన్స్ చూస్తూ ఉంటె 200 కోట్ల మార్క్ ని అందుకోవడం పెద్ద కష్టమేమి కాదని అంచనా వేస్తున్నారు. దృశ్యం 2 మలయాళ తెలుగు వర్షన్ లు థియేటర్స్ లో రిలీజ్ అవ్వక పోయినా హిందీ వర్షం మాత్రం ఊచకోత కోస్తూ దూసుకు పోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here