ఓవరాల్ గా సినిమా 5 వ రోజు 40 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని కన్ఫాం చేసుకుంది. దాంతో టోటల్ గా 5 రోజుల కలెక్షన్స్ లెక్కలు ఇప్పుడు 420 కోట్ల మార్క్ ని అందుకున్నట్లు సమాచారం. బాహుబలి సిరీస్ తర్వాత ఈ మార్క్ అందుకున్న ఒకేఒక్క సినిమా 2.0.
అఫీషియల్ ఏరియాల వారి కలెక్షన్స్ వివరాలు తెలియాల్సి ఉండగా సినిమా హిందీ లో కొంచం బెటర్ గా పెర్ఫార్మ్ చేస్తుండటం విశేషం. తమిళ్ కలెక్షన్స్ మాత్రం అందరికీ ఒకింత షాక్ నే కలిగిస్తున్నాయి. ఎందుకనో ఒక్క చెన్నై తప్ప మిగిలిన ఏరియాల్లో సినిమా సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేక పోతుంది. ఓవరాల్ గా 420 కోట్ల తో దుమ్ము లేపిన ఈ సినిమా ఇంకా స్ట్రాంగ్ కలెక్షన్స్ ని సాధించాల్సిన అవసరం ఉంది.