సీనియర్ యాక్టర్ మంచు మోహన్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సన్ ఆఫ్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ఫిబ్రవరి 18 న రిలీజ్ అయిన ఈ మూవీ లాస్ట్ వీకెండ్ రిలీజ్ అయిన టోటల్ మూవీస్ లో నోటబుల్ మూవీ అవ్వగా అన్ సీజన్ ఎఫెక్ట్ అండ్ మూవీ పై పెద్దగా బజ్ లాంటివి లేక పోవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంపాక్ట్ ని క్రియేట్ చేయలేక పోయింది అని చెప్పాలి.
సినిమా మొదటి రోజు నుండే అండర్ పెర్ఫార్మ్ చేయగా వీకెండ్ తర్వాత వర్కింగ్ డేస్ లో కూడా ఏమాత్రం ఇంపాక్ట్ ని హోల్డ్ ని చూపలేక పోయిన సినిమా మొత్తం మీద 4 రోజుల్లో 12 లక్షల దాకా గ్రాస్ ను సొంతం చేసుకోగా 5 వ రోజు మరో 2.5 లక్షల గ్రాస్ ను…
సొంతం చేసుకున్నట్లు సమాచారం. మొత్తం మీద 5 రోజుల్లో 15 లక్షల దాకా గ్రాస్ ను సినిమా సొంతం చేసుకోగా కృష్ణా ఏరియాలో 56 వేల షేర్ ని అందుకుంది… అన్ని ఏరియాల్లో 8 లక్షల దాకా షేర్ ని సినిమా సొంతం చేసుకున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. సినిమా బడ్జెట్ దృశ్యా ఇవి చాలా నిరాశకలిగించే కలెక్షన్స్ అని చెప్పాలి. ఇలాంటి రిజల్ట్ ను మేకర్స్ అస్సలు ఊహించి ఉండరు…