బాక్స్ ఆఫీస్ దగ్గర హిందీలో అన్ సీజన్ లో ఊహకందని కలెక్షన్స్ తో ఊచకోత కోస్తూ దూసుకు పోతున్న విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఛావా సినిమా అన్ని చోట్లా అంచనాలను మించే కలెక్షన్స్ ని దక్కించుకుంటూ ఉండటం విశేషం కాగా రెండో వీక్ వర్కింగ్ డేస్ లో కూడా ఛావా సినిమా రిమార్కబుల్ హోల్డ్ ని చూపెడుతూ ఉండటం విశేషం.
సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 12 రోజులు పూర్తి అయ్యే టైంకి వరల్డ్ వైడ్ గా హిస్టారికల్ 500 కోట్ల మమ్మోత్ గ్రాస్ మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించింది….ఇప్పట్లో ఈ జాతర ఆగడం కూడా కష్టంగానే కనిపిస్తూ ఉండటంతో లాంగ్ రన్ లో సినిమా మరిన్ని అద్బుతాలు సృష్టించే అవకాశం ఉంది.
సినిమా 11వ రోజున ఇండియా లో 19.10 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా 12వ రోజున కలెక్షన్స్ లో డ్రాప్స్ ఉంటాయి అనుకున్నా కూడా 11వ రోజు వసూళ్ళని కూడా మించి పోయిన సినిమా 19.23 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని దాటేసి ఎక్స్ లెంట్ గా జోరు చూపించింది.
ఇక టోటల్ గా 12 రోజుల్లో సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
#Chhaava Sensational Collections
👉Day 1 – 33.10CR
👉Day 2 – 39.30CR
👉Day 3 – 49.03CR
👉Day 4 – 24.10CR
👉Day 5 – 25.75CR
👉Day 6 – 32.40CR
👉Day 7 – 21.60CR
👉Day 8 – 24.03CR
👉Day 9 – 44.10CR
👉Day 10 – 41.10CR
👉Day 11 – 19.10CR
👉Day 12 – 19.23CR
Total collections – 372.84CR NET💥💥💥💥
సినిమా ఊహకందని జోరు చూపెడుతూ 400 కోట్ల మార్క్ ని త్వరలో అందుకోబోతుండగా….ఇండియాలో సినిమా టోటల్ గ్రాస్ లెక్క 440 కోట్ల మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించగా ఓవర్సీస్ లో సినిమా 75 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుని ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపెడుతుంది.
దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా 12 రోజులు పూర్తి అయ్యే టైంకి సినిమా 500 కోట్ల మమ్మోత్ గ్రాస్ మార్క్ ని దాటేసి 515 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో సంచలనం సృష్టించి ఇప్పుడు 600 కోట్ల మార్క్ వైపు పరుగులు పెడుతుంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.