Home న్యూస్ అక్కడ హైయెస్ట్ 2CR….కానీ ఇప్పుడు 50 కోట్లతో ఈ సినిమా చరిత్ర సృష్టించింది!

అక్కడ హైయెస్ట్ 2CR….కానీ ఇప్పుడు 50 కోట్లతో ఈ సినిమా చరిత్ర సృష్టించింది!

0

అన్ సీజన్ లో ఇతర ఇండస్ట్రీలు అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేయడం లేదు, అదే టైంలో మలయాళ ఇండస్ట్రీ నుండి మాత్రం సాలిడ్ కలెక్షన్స్ తో వరుస పెట్టి సినిమాలు సంచలన కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ ఉండగా బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులతో దూసుకు పోతున్న మంజుమ్మేల్ బాయ్స్(Manjummel Boys Movie Collections)….

ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకు పోతూ ఉండగా సినిమా కేరళలో సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ ఉంటే అక్కడకి మించి సినిమా పక్క రాష్ట్రం తమిళనాడులో రికార్డ్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతుంది…. తమిళనాడులో ఇప్పటి వరకు ఏ మలయాళ…

సినిమా కూడా 2 కోట్ల రేంజ్ కి మించి గ్రాస్ ను అందుకోలేదు….కానీ అదే టైంలో మంజుమ్మేల్ బాయ్స్ మాత్రం ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ మొట్ట మొదటి 10,20,30 మరియు 40 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించగా ఇప్పుడు లేటెస్ట్ గా సినిమా తమిళనాడులో…

ఎపిక్ రికార్డ్ ను నమోదు చేస్తూ 50 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని ఊహకందని బెంచ్ మార్క్ ని సెట్ చేసింది….చాలా వరకు తమిళ్ ఆడియన్స్ ఓన్ సినిమాలను కాకుండా ఇతర సినిమాలను ఎంకరేజ్ చేయరు… కానీ తమిళనాడు నేపధ్యంలోనే మంజుమ్మేల్ బాయ్స్ సినిమా తెరకేక్కడంతో….

అనుకున్న దానికి మించి అక్కడ సెన్సేషనల్ రెస్పాన్స్ ను సొంతం అయ్యేలా చేశారు…లాంగ్ రన్ లో ఇప్పుడు ప్రతిష్టాత్మక 50 కోట్ల గ్రాస్ మార్క్ తో సంచలన రికార్డ్ ను నమోదు చేసుకుంది. సినిమా ఊపు చూస్తూ ఉంటే ఇప్పట్లో రన్ అయితే ఆగేలా కనిపించడం లేదు. మరి టోటల్ రన్ లో ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here