బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో మేజర్ గ్రోత్ ని సొంతం చేసుకున్న ఏరియా నైజాం…ఇది వరకు ఆంధ్ర సీడెడ్ లతో పోల్చితే మంచి మార్కెట్ ఉన్నప్పటికీ రీసెంట్ టైంలో కొన్ని సినిమాలు ఆంధ్ర సీడెడ్ కి మించి నైజాం ఏరియా గ్రోత్ భారీగా పెరిగింది. మల్టీప్లెక్సులు పెరగడం, టికెట్ హైక్స్ కూడా సొంతం అవుతూ ఉండటంతో…
క్రమం తప్పకుండా నైజాం ఏరియా మార్కెట్ పెరిగిపోతూ ఉండగా రీసెంట్ టైంలో ఇక్కడ వరుస పెట్టి కొన్ని సినిమాలు 50 కోట్ల షేర్ మార్క్ ని సైతం అందుకుంటూ మాస్ రచ్చ చేస్తూ ఉండటం…2017 టైంలో ఇక్కడ బాహుబలి2 మొట్ట మొదటి సారిగా 50 కోట్ల షేర్ మార్క్ ని దాటేసి…
సంచలనం సృష్టించగా….ఆ తర్వాత బాహుబలి2 ని అందుకోవడానికి ఆల్ మోస్ట్ 5 ఏళ్ళకి పైగా టైం పట్టగా ఆర్ ఆర్ ఆర్ మూవీ ఈ రికార్డ్ ను బ్రేక్ చేసి 100 కోట్ల లీగ్ ను ఓపెన్ చేసింది…ఇక తర్వాత టైం లో ఇప్పటి వరకు కేవలం 3 సినిమాలు మాత్రమే 50 కోట్ల షేర్ మార్క్ ని దాటేశాయి…
వాటిలో లాస్ట్ ఇయర్ వచ్చిన సలార్(Salaar Movie) ఈ ఇయర్ వచ్చిన కల్కి(Kalki 2898 AD) సినిమాలు ఈ మార్క్ ని అందుకోగా రీసెంట్ గా దేవర(Devara Part1) ఈ మార్క్ ని అధిగమించింది…. మొత్తం మీద నైజాంలో ప్రస్తుతానికి పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్…
ప్రభాస్(Prabhas) 3 సార్లు 50 కోట్ల షేర్ మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించగా…మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Jr NTR) 2 సార్లు 50 కోట్ల షేర్ మార్క్ ని అందుకోగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ఒకసారి ఈ మార్క్ ని అందుకున్నాడు….
ఓవరాల్ గా మిగిలిన హీరోలు ఇంకా ఇక్కడ 50 కోట్ల షేర్ మార్క్ ని అందుకోవాల్సి ఉండగా అప్ కమింగ్ టైంలో ఆల్ మోస్ట్ అందరు టాప్ స్టార్స్ నటించిన సినిమాలు వరుస పెట్టి రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండటంతో ఈ లీగ్ లో మరింత మంది ఎంటర్ అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.