Home న్యూస్ 57 కోట్ల కోర్ట్ మూవీ ఓటిటి రెస్పాన్స్…అది ఒక్కటి తప్ప….యునానిమస్!!

57 కోట్ల కోర్ట్ మూవీ ఓటిటి రెస్పాన్స్…అది ఒక్కటి తప్ప….యునానిమస్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర నాచురల్ స్టార్ నాని(Nani) నిర్మాతగా నిర్మించిన లేటెస్ట్ మూవీ కోర్ట్(Court State Vs A Nobody Movie) సినిమా ఆడియన్స్ ముందుకు అన్ సీజన్ లో రిలీజ్ అయ్యి నాని బ్రాండ్ వాల్యూ ఇంపాక్ట్ తో అనుకున్న దాని కన్నా కూడా బెటర్ గా జోరు ని చూపించి రిమార్కబుల్ ట్రెండ్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించి..

లాంగ్ రన్ లో అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా…ఓవరాల్ గా 57 కోట్లకు పైగానే గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకున్న సినిమా అన్ సీజన్ లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచి రీసెంట్ గా డిజిటల్ లో రిలీజ్ అయింది. నెట్ ఫ్లిక్స్ లో సినిమా డిజిటల్ రిలీజ్ ను…

రీసెంట్ గా సొంతం చేసుకున్న కోర్ట్ మూవీ ఇక్కడ కూడా ఆడియన్స్ నుండి ఎక్స్ లెంట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది. సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ అయిన మైనర్ లవ్ స్టోరీ ఇప్పటి ఆడియన్స్ కి కొంచం ఓవర్ గా అనిపించినా కూడా ఆ ఏజ్ లో జరిగేవి అలాగే ఉంటాయి కాబట్టి…

ఆ ఒక్క లవ్ స్టోరీ తప్ప మిగిలిన సినిమా కోర్ట్ డ్రామా కానీ ప్రియదర్శి యాక్టింగ్ అలాగే కోర్టు సీన్స్ అన్నీ కూడా ఎక్స్ లెంట్ గా ఉండటంతో లవ్ స్టోరీ మరీ అనుకున్న రేంజ్ లో అనిపించక పోయినా కూడా మిగిలిన సినిమా అంతా కూడా బాగానే ఇంప్రెస్ చేసిందని అంటూ ఉండగా…

అన్నింటికీ మించి శివాజీ యాక్టింగ్ తో మిగిలిన అందరినీ ఫుల్లుగా డామినేట్ చేసిన తీరు బాగా మెప్పించింది అంటున్నారు. మొత్తం మీద సినిమా అటు బాక్స్ ఆఫీస్ దగ్గరే కాదు ఇప్పుడు డిజిటల్ లో కూడా ఆడియన్స్ నుండి యునానిమస్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని దూసుకు పోతూ ఉండగా…

టాప్ ట్రెండ్ మూవీస్ లో ఒకటిగా దూసుకు పోతున్న కోర్ట్ మూవీ ఓవరాల్ గా నిర్మాతగా నాని నిర్మించిన మూవీస్ లో సెన్సేషనల్ హిట్ గా నిలిచి అటు బాక్స్ ఆఫీస్ తో పాటు ఇటు డిజిటల్ లో కూడా యునానిమస్ రెస్పాన్స్ తో మాస్ రచ్చ చేస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here