టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం(Guntur Kaaram Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి మిక్సుడ్ రెస్పాన్స్ ను మొదటి ఆటకు సొంతం చేసుకున్నా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పండగ సెలవుల అడ్వాంటేజ్ తో 5 రోజుల్లో సాలిడ్ కలెక్షన్స్ నే…
బాక్స్ ఆఫీస్ దగ్గర నమోదు చేసింది. అన్ని చోట్లా 5వ రోజున సినిమా మరోసారి మంచి కలెక్షన్స్ తో హోల్డ్ చేసింది ఇప్పుడు. తెలుగు రాష్ట్రాల్లో సినిమా 5వ రోజున 7 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకుంటే సినిమా మొత్తం మీద 7.32 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకుని మరోసారి మంచి హోల్డ్ ని చూపించింది.
ఇక వరల్డ్ వైడ్ గా సినిమా స్లో డౌన్ అవ్వగా ఓవరాల్ గా సినిమా 5వ రోజున 7.87 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకోగా గ్రాస్ 14.70 కోట్ల రేంజ్ లో సొంతం చేసుకుని జోరు చూపించింది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 5 రోజుల్లో సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
Guntur Kaaram 5 Days Total World Wide Collections(Inc GST)
👉Nizam: 30.40Cr
👉Ceeded: 8.06Cr
👉UA: 8.40Cr
👉East: 6.88Cr
👉West: 4.42Cr
👉Guntur: 7.09Cr
👉Krishna: 5.26Cr
👉Nellore: 2.94Cr
AP-TG Total:- 73.45CR (110.00CR~ Gross)
👉KA+ROI:- 5.60Cr
👉OS: 13.40Cr***
Total WW:- 92.45CR (149.10CR~ Gross)
(70%~ Recovery)
మొత్తం మీద సినిమా బాక్స్ అఫీస్ దగ్గర 133 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఆల్ మోస్ట్ 70% వరకు రికవరీని సొంతం చేసుకున్న ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 40.55 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తుందో చూడాలి ఇప్పుడు.