Home న్యూస్ 12 కోట్ల నుండి నెల కి 5 లక్షల రెమ్యునరేషన్…షాకింగ్ న్యూస్

12 కోట్ల నుండి నెల కి 5 లక్షల రెమ్యునరేషన్…షాకింగ్ న్యూస్

0

  దర్శకుడిగా కెరీర్ లో చేసిన తొలి సినిమాలతోనే తానెంటో ప్రూవ్ చేసుకున్న శ్రీనువైట్ల, వెంకీ, దుబాయ్ శీను, ఢీ, రెడీ, దూకుడు, బాద్ షా ఇలా సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటూ ఏకంగా 12 కోట్ల రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకుంటూ టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా నిలిచి అందరు హీరోల ఫేవరేట్ డైరెక్టర్స్  లో ఒకరిగా చేరాడు. అలాంటి శ్రీనువైట్ల రొటీన్ ఫార్మాట్ ని వీడక పోవడంతో వరుస పరజాయలు వచ్చాయి.

ఆగడు, బ్రూస్ లీ, మిస్టర్ రీసెంట్ గా వచ్చిన అమర్ అక్బర్ ఆంటోని ఇలా ఒకదానిని మించిన ఫ్లాఫ్ మరోటి ఇస్తూ మిస్టర్ కి 1 కోటి రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకున్నాడని టాక్ ఉంది. ఇక అమర్ అక్బర్ ఆంటోని కి నెలకి 5 లక్షల జీతంతో పని చేశాడని టాక్ ఉంది.

ఒకవేళ సినిమా సక్సెస్ అయితే తర్వాత 2 కోట్లు అధికంగా రెమ్యునరేషన్ దక్కేదని కానీ సినిమా రిజల్ట్ తో కేవలం నెలకి 5 లక్షల చొప్పున 8 నెలలకి 40 లక్షల రెమ్యూనరేషన్ మాత్రమె ఈ సినిమా కి గాను దక్కిందనే వార్తలు ఉన్నాయి. కామెడీ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన శ్రీనువైట్ల మళ్ళీ ఓ అల్టిమేట్ బ్లాక్ బస్టర్ తో సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here