బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ లో ఓవరాల్ గా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఇప్పుడు వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయిన అవతార్ 2 సినిమా 4వ రోజు ఉన్నంతలో డ్రాప్స్ కొంచం ఎక్కువగానే ఉన్నా కానీ ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసింది. ఇక సినిమా తెలుగు లో ఓవరాల్ గా డీసెంట్ హోల్డ్ ని చూపించగా ఇప్పుడు 5వ రోజులో ఎంటర్ అయిన అవతార్ 2 సినిమా…
మరోసారి 25% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు కొద్ది వరకు హోల్డ్ ని అయితే చూపించింది. దాంతో ఇప్పుడు సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 3.8 కోట్ల నుండి 4 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోవచ్చు.
ఇక సినిమా ఇండియాలో ఈ రోజు అటూ ఇటూగా 13 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే 14 కోట్లు ఆ పైన కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక సినిమా గ్రాస్ పరంగా ఈ రోజు ఇండియాలో…
18 కోట్ల నుండి 19 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే 20 కోట్ల మార్క్ ని టచ్ చేసే అవకాశం కొద్ది వరకు ఉంది. మొత్తం మీద మరో వర్కింగ్ డే లో పర్వాలేదు అనిపిస్తున్నా కానీ సినిమా రేంజ్ కి ఇంకా ఎక్కువ వసూళ్ళని అందుకోవాల్సింది.