బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ లో వీర లెవల్ కలెక్షన్స్ తో మాస్ కుమ్ముడు కుమ్మేసిన యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమా ఇప్పుడు వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టగా 4వ రోజున కొంచం అనుకున్న దాని కన్నా ఎక్కువగా డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కూడా ఉన్నంతలో ఆల్ రెడీ…
వీకెండ్ లోనే కలెక్షన్స్ పరంగా వీర విహారం చేయడంతో 4 రోజుల్లో సాలిడ్ రికవరీని దక్కించుకోగా ఇప్పుడు 5వ రోజున మరో వర్కింగ్ డే టెస్ట్ లో ఎంటర్ అయిన సినిమా అన్ని చోట్లా డీసెంట్ హోల్డ్ నే చూపెడుతూ దూసుకు పోతుంది. మొత్తం మీద 4వ రోజుతో పోల్చితే బాక్స్ ఆఫీస్ దగ్గర..
5వ రోజున ఇప్పుడు 15-20% రేంజ్ లో డ్రాప్స్ ను మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు సొంతం చేసుకుంటూ వెళుతున్న సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు కొద్ది వరకు గ్రోత్ ని అయితే చూపించే అవకాశం ఉందని చెప్పాలి. ఓవరాల్ గా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే ఆఫ్ లైన్ లో కూడా..
ఇదే రేంజ్ లో డ్రాప్స్ ఉంటే 2.5 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని సినిమా తెలుగు రాష్ట్రాల్లో అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే షేర్ లెక్క కొంచం పెరిగే అవకాశం ఉంటుంది. ఇక ఓవర్సీస్ లో సినిమా కొంచం ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకోగా…
ఈవినింగ్ అండ్ నైట్ షోలలో ఏమైనా గ్రోత్ ఉంటే వరల్డ్ వైడ్ లెక్క 2.8-3 కోట్ల రేంజ్ దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది. మరి సినిమా డే ఎండ్ అయ్యే టైంకి ఇదే రేంజ్ లో ట్రెండ్ ను చూపిస్తుందో లేక గ్రోత్ ని దక్కించుకుని కుమ్ముతుందో చూడాలి ఇప్పుడు…